ప్రశ్న:- ”నా వయస్సు 42 సంవత్సరాలు. పది సంవత్సరాల క్రితం హిస్టెరెక్టమీ అయిపోయింది. అప్పటి నుంచి బహిష్టులు లేవు. హిస్టెరెక్టమీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా 7-8 సంవత్సరాలు సెక్స్‌లో చక్కగా ఎంజాయ్ చేశాను. మొదటి నుంచి నాకు సెక్స్ అంటే ఎంతో ఇంట్రస్టు, అలాంటి నాకు ఇప్పుడు సెక్స్ అంటే విరక్తి అనిపిస్తోంది. సెక్స్‌లో పాల్గొంటే నొప్పి అనిపిస్తోంది. నాకు బాధ అయినప్పటికీ మా వారు సెక్స్ చేయకుండా ఊరుకోరు. తరచుగా మా ఇద్దరి మధ్య ఈ విషయమై గొడవ జరుగుతోంది. డాక్టరు దగ్గరికి పోయి మందులు తెచ్చుకోమని మా వారు గొడవ పెడతారు. నాకు సెక్స్ ఇంట్రస్టు లేదని డాక్టరుతో ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. ఇటీవల తరచూ జ్వరం వచ్చినట్టు ఉంటోంది. అర్థంలేని బాధలు కలుగుతున్నాయి. చాలా చిరాకుగా ఉంటోంది. ఈ బాధల వల్ల చచ్చిపోవాలనిపిస్తోంది. నా బ్రతుక్కి వేరే ఏదైనా మార్గం ఉందా?”
జవాబు:- మీకు 42 సంవత్సరాలకే మెనోపాజ్ లక్షణాలు ఏర్పడ్డాయి. హిస్టరెక్టమీ పాటు రెండు ఓవరీస్ తీసేయడం జరిగితే త్వరగా మెనోపాజ్ వస్తుంది. గర్భసంచితో పాటు ఓవరీస్‌ని తీసేయకపోయినప్పటికీ రెగ్యులర్ మెన్సస్ లేకపోవడంతో వాటి పని తీరులో తేడా వచ్చి ఓవరీస్ పనిచేయడం ఆగిపోతుంది. మీరు డాక్టరుకి చూపించుకుని ఈస్ట్రోజన్ బిళ్ళలు వాడండి. మీలోని మెనోపాజ్ బాధలు తొలగిపోతాయి. తిరిగి సెక్సువల్‌గా మామూలు అయిపోతారు. యోనిలో మంట లేకుండా అవుతుంది. మెనోపాజ్ వల్ల మీలో డిప్రషన్ లక్షణాలు కూడా వచ్చాయి. అవి కూడా తగ్గిపోయి హ్యాపీగా తయారవుతారు. డాక్టరుని సంప్రదించండి.