Tuesday, October 19, 2021
spot_img

చిన్నదైతే ఎలా?

ప్రశ్న:-   ”నా వయస్సు 18 సం||లు. సన్నగా ఉంటాను. సెక్స్‌ గురించి ఎంత కోరిక ఉందో అంతే భయం కూడా ఉంది. నా యోని చిన్నదని అనుమానం. యోని దగ్గర అద్దం పెట్టుకుని అనేకసార్లు నిశితంగా పరిశీలించాను. బలపమంత కన్నం మాత్రమే కనబడింది. యోని పెదవులని బాగా ప్రక్కకి లాగి కూడా చూసాను. యోని రంధ్రం చాలా చిన్నది. ఇంత చిన్న రంధ్రం అయినప్పుడు నేను సెక్స్‌కి ఎలా పనికివస్తాను? సెక్స్‌ కోరికలైతే విపరీతం. తట్టుకోలేకపోతుంటాను. రేపు పెళ్ళై భర్తతో ఒకటి కాలేకపోతే నా బతుకు ఏమైపోవాలి? భర్త నన్ను ఓలా స్వీకరించగలడు? పెళ్లికి ముందు ఏదైనా ఆపరేషన్‌ చేయించుకుని ఫస్ట్‌నైట్‌ సునాయాసంగా జరిగేటట్లు చేసుకోవచ్చా? నేను ఏం చేయాలో మీరే చెప్పండి.” 

జవాబు:-     పెళ్లికాని అమ్మాయిలలో యోని రంధ్రం పైకి చూడటానికి చాలా చిన్నదిగానే అనిపిస్తుంది. దానిలో బలపం లేదా పెన్సిల్‌ మాత్రమే దూరగలవనిపిస్తుంది. కాని అంగప్రవేశంతో మొదటిసారికే అతి సులువుగా వెడల్పు అవుతుంది. యోని రంధ్రం ఎంతైనా వెడల్పుగా మారగలదు. అందుకనే శిశు జననం కూడా అందులో నుంచి అతి తేలికగా అవుతుంది. శిశు జననం అయిన తర్వాత తిరిగి వెంటనే చిన్న రంధ్రంగా మారిపోతుంది. ఇదే యోని దగ్గర కండరాల ప్రత్యేకత. అందుకని అనవసరంగా భయపడవద్దు. ధైర్యంగా పెళ్లి చేసుకోండి. మీరు తప్పకుండా వైవాహిక జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేస్తారు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!