Friday, October 22, 2021
spot_img

వాళ్ళకూ నాకూ ఏమిటి తేడా?

ప్రశ్న:-”నాదొక వింత సమస్య. నా వయస్సు 22 సంవత్సరాలు. నా స్నేహితులందరికీ నిద్రలో కలలు వచ్చి వీర్యం పడిపోతుందట. కాని నాకు ఎప్పుడూ అలా జరగలేదు. నేను రోజూ హస్తప్రయోగం చేస్తాను. వీర్యం అప్పుడు బాగానే పడుతుంది. కాని నిద్రలో పోవడంలేదు. ఇది ఏమైనా సెక్స్‌ లోపమా? నాలో పుంసత్వం ఉండవలసినంత లేదా?” 

జవాబు:- యుక్తవయస్సు వచ్చిన దగ్గర నుంచి నిద్రలో వీర్యం పోవడం సహజమైన విషయమే. అయితే అందరికీ అలా పోవడం ఉండదు. కేవలం 60-70 శాతం మందిలోనే కలలు రావడం, వీర్యం పోవడం ఉంటుంది. హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళకి నిద్రలో వీర్యం పోవడం అరుదు. హస్తప్రయోగం అంతగా చేయని వాళ్ళల్లోనూ, హస్తప్రయోగం చేసేందుకు అవకాశం లేనివాళ్ళల్లోనే నిద్రలో వీర్యం కారిపోవడం ఎక్కువ. యుక్తవయస్సు వచ్చిన దగ్గర నుంచి నిరంతరం వీర్యం తయారీ ఉంటుంది. ఇలా తయారైన వీర్యం ఏదో ఒక రూపంలో బయటకు కారిపోవలసిందే. అది లోపలే ఉండిపోవడం, తిరిగి ఒంటికి చేరడం ఉండదు. మీకు రోజూ హస్తప్రయోగం చేసే అలవాటు ఉంది కనుక ఎప్పటికప్పుడు వీర్యకోశాలు ఖాళీ అయిపోతూ నిద్రలో పోవలసిన అవసరం లేకుండా ఉంది. హస్తప్రయోగం చేయడం, స్త్రీతో సెక్స్‌లో పాల్గొనడం లేనప్పుడు శుక్రకోశాలు వీర్యంతో నిండిపోయి ఏ మాత్రం సెక్సువల్‌ స్టిమ్యులేషన్‌ కలిగినా వీర్యం కారిపోతుంది. ఇదేమీ సెక్స్‌ బలహీనత కాదు. మీ విషయంలో హస్తప్రయోగం రూపంలో వీర్యం బయటకు పోతోంది. కనుక నిద్రలో పోవడం లేదు. అంతే తప్ప మీలో సెక్స్‌ లోపం ఉండటం కాదు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!