Friday, October 22, 2021
spot_img

ఎలా మానుకోవాలి?

ప్రశ్న:-   ”నా వయస్సు 20 సంవత్సరాలు. గత 5 సంవత్సరాలుగా హస్తప్రయోగం అలవాటు ఉంది. దానివల్ల రోజురోజుకి అంగం వంకర అవడమే కాకుండా కృశించిపోతోంది. పూర్వంలాగా అంగస్థంభనలు కూడా లేవు. పెళ్లి అంటేనే భయంగా ఉంది. హస్తప్రయోగం అలవాటుని ఎలా మానుకోవాలి? అంగానికి కలిగిన నష్టాన్ని ఎలా పోగొట్టుకోవాలి?”

జవాబు:-     హస్తప్రయోగం అలవాటు ఏ మాత్రం హానికరం కాదు. దానివల్ల అంగం వంకర అవడం, కృశించడం జరగదు. అనవసరంగా హస్తప్రయోగం గురించి అపోహలు, భయాలు ఉన్నాయి. సెక్స్‌ విజ్ఞానం లేకపోవడం, ఎక్కడో ఎవరో చెప్పిన మాటలు విని భయానికి లోనవడం ఉంటుంది. హస్తప్రయోగం గురించి మీలో గాఢంగా ఏర్పడిన భయం అంగం వంకర అయినట్లు భ్రాంతి కలిగిస్తోంది. హస్త ప్రయోగం అలవాటు నూటికి 99 మందిలో ఉంటుంది. యుక్తవయస్సు వచ్చిన తర్వాత హస్తప్రయోగం అలవాటు అనుకోకుండా ఏర్పడుతుంది. హస్తప్రయోగం అలవాటు ఆరోగ్య లక్షణమేగాని అనారోగ్య లక్షణం కాదు. హస్తప్రయోగం అలవాటు లేకపోతే ఆ వ్యక్తిలో మానసిక ఎదుగుదల లేదనో లేదా హార్మోన్ల పరంగా లేదా శారీరకంగా ఉందనో భావించాలి. హస్తప్రయోగం అలవాటుని బలవంతంగా మానుకోవడానికి ప్రయత్నించనవసరం లేదు. మీరు వివాహానికి పూర్తిగా అర్హులే.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!