Tuesday, December 6, 2022
spot_img

ఎనిమిదో నెల వరకే…

ప్రశ్న:-”నాకు పెళ్ళై సంవత్సరమైంది. ఇప్పుడు నేను 5 నెలల గర్భిణిని. మేము పెళ్ళైన దగ్గర నుంచి రోజుకి కనీసం మూడుసార్లు సెక్సులో పాల్గొంటున్నాం. అలా పాల్గొనకపోతే ఏదో వెలితిగా, కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఇద్దరికీ సెక్సు మీద ఇంట్రస్టు ఎక్కువే. ఒకళ్ళు రెడీ అంటే, రెండో వాళ్ళం కూడా వెంటనే రెడీ అంటాం. వెంటనే సెక్సులో పాల్గొంటాం. చక్కని థ్రిల్‌ పొందుతాం. 5 నెలల గర్భిణీని అయినప్పటికీ అలాగే రోజుకి 3-4 సార్లు సెక్సు చేసుకుంటున్నాం. ఇదేమైనా గర్భంలోని పిండానికి ప్రమాదమా? నా స్నేహితురాలైతే గర్భిణీ సెక్సులో ఎంత ఎక్కువ పాల్గొంటే అంత మంచిదని చెబుతుంది. తాను రెండు కాన్పుల్లోనూ చివరి రోజు వరకు సెక్సులో పాల్గొందట. దానివల్ల పిల్లలిద్దరూ దబ్బపండుల్లాగా పుట్టారని పురుషుని వీర్యంతో గర్భంలోని బిడ్డ మరింత బలంగా తయారవుతుందని చెప్పింది. సెక్సులో పాల్గొనడం వల్ల గర్భాశయానికి తెలియకుండా వ్యాయామం జరుగుతుందని, దానివల్ల కాన్పు అయిపోతుందని చెప్పింది. నా స్నేహితురాలు చెప్పింది నిజమేనా? నేను కూడా విడవకుండా సెక్సులో పాల్గొంటే పండంటి బిడ్డని కంటానా? కాన్పు సులువుగా అయిపోతుందా?”

జవాబు:- ఎనిమిదవ నెల నిండేవరకూ సెక్సులో మామూలుగా పాల్గొనవచ్చు. ఎన్నిసార్లయినా పాల్గొనవచ్చు. అటు తరువాత కాస్త జాగ్రత్తగా ఉండాలి. గట్టిగా స్ట్రోక్స్‌ ఇవ్వకుండా సెక్సులో పాల్గొనాలి. జాగ్రత్తగా సెక్సులో పాల్గొంటే చివరి రోజు వరకు సెక్సులో పాల్గొన్నా ఏమీ అవదు. నిండు గర్భిణీ సెక్సులో పాల్గొనేటట్టయితే పురుషుడు కింద, స్త్రీ పైన ఉండే విధంగా పాల్గొంటే మంచిది. అలాచేస్తే పురుషుడు గట్టిగా స్ట్రోక్స్‌ ఇచ్చే అవకాశంగాని, కడుపుమీద బరువుపడే అవకాశం కాని ఉండదు. మీ విషయంలో ఎనిమిది నెలలు నిండేవరకు మామూలుగానే సెక్స్‌లైఫ్‌ని ఎంజాయ్‌ చేయండి. ఆ తరువాత జాగ్రత్తలు తీసుకోండి. పురుషుని వీర్యం ఏ విధంగానూ గర్భస్థ శిశువుకి చేరదు. అదీకాక వీర్యం ఏమాత్రం బలవర్థక పదార్థం కాదు. సెక్సులో పాల్గొనడం వల్ల గర్భిణీ స్త్రీకి కండరాల స్టిఫ్‌నెస్‌ తగ్గి నడుమునొప్పి, కాళ్ళనొప్పులు రావు. అంతేకాని ఆ ఎక్సర్‌సైజు వల్ల గర్భాశయం బలంగా తయారవుతుందని కాదు. కాన్పు నొప్పులు గట్టిగా రావడానికి, గర్భాశయం బలంగా ఉండటానికి సంబంధం లేదు. ఏది ఏమైనా మీరు రెగ్యులర్‌గా డాక్టరు చేత చెకప్‌ చేయించుకుంటారు కనుక డాక్టరుతో మాట్లాడుతూ సెక్స్‌లైఫ్‌ని ఎలా కొనసాగించాలో తెలుసుకోండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!