ప్రశ్న:- ”నాకు బి.పి. ఉంది. స్మోకింగ్ చేస్తాను. రోజూ కాకపోయినా తరచుగా ఆల్కహాలు తీసుకుంటాను. షుగరు లేదు కనుక అన్నీ మామూలుగానే తినేస్తాను. వాకింగ్ అలవాటు లేదు. వాకింగ్ చేయడానికి టైము ఉండదు. బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నాను. మానసిక వత్తిడి కూడా ఎక్కువే. నెలకి 4-5 సార్లు తప్ప సెక్స్‌లో పాల్గొనడానికి కుదరదు. నేను ఎక్కువ స్ట్రెస్ ఫీలవడానికి సెక్స్‌లో పాల్గొనకపోవడమే కారణమా?”
జవాబు:- ఎంత బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయినప్పటికీ, ఎంత బిజీ పర్సన్ అయినప్పటికీ ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ లైఫ్‌స్టైల్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. రక్తపోటుకి కేవలం మందులు వాడితే సరిపోదు. తప్పకుండా వాకింగ్ చేయాలి. స్మోకింగ్, డ్రింకింగ్ పనికిరావు. బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయినంత మాత్రాన అవన్నీ తప్పనిసరని అనుకోవడం తప్పు. ఎంత బిజీ పర్సన్ అయినప్పటికీ రోజులో కనీసం అరగంటైనా ఆరోగ్యం కోసం వాకింగ్ చేయాలి. ఆ మాత్రం సమయం కూడా దొరకదనుకుంటే టైమ్ మేనేజ్మెంట్ చేతకాదు అనుకోవాలి. చక్కని ఆరోగ్య నియమాలు, అలవాట్లు వుంటే మానసిక వత్తిడి కూడా అంతగా ఉండదు. వాకింగ్ తప్పకుండా స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. మీరు ఆరోగ్య నియమాలు పాటించకపోవడం వల్లే తెలియని అలసట లుగుతోంది. ఓపిక లేనట్టు అవుతోంది. మంచి అలవాట్లు, వ్యాయామం, సరైన భోజనం ఉంటే ఎంత పనిచేసినా అలసిపోవడం ఉండదు. సెక్స్‌లో పాల్గొనడానికి ఓపిక లేకపోవడం ఉండదు. అందుకని మీ లైఫ్‌స్టైల్ మేనేజ్మెంట్ ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుకోండి. అప్పుడే మీ లైఫ్ హ్యాపీలైఫ్గా మారుతుంది.