ప్రశ్న:- ”నాకు పెళ్ళి నిశ్చయమైంది. నేను పొట్టిగా ఉంటాను. నాకు కాబోయే భర్త చాలా ఎత్తుగా, లావుగా ఉంటాడు. అన్నీ కలిసి వచ్చాయని, మంచి సంబంధం అని మా వాళ్ళు ఈ సంబంధం సెటిల్ చేశారు. అనుక్షణం నన్ను ఒక భయం వణికిస్తోంది. సన్నగా, పొట్టిగా ఉండే నేను పొడవుగా, లావుగా ఉండే అతనితో సంసారంలో పాల్గొనగలనా? ఒకవేళ సంసారంలో పాల్గొంటే యోని చీరుకుపోయి అధిక రక్తస్రావం జరిగి ప్రాణం పోతుందా? మా అమ్మతో నా భయం గురించి చెబితే ‘ఛీ, నోర్మూసుకో. ఇంత మంచి సంబంధం వస్తే ఆ పిచ్చి మాటలు ఏమిటి?’ అని నా మాట కొట్టిపారేసింది. కాని పెళ్ళి అంటేనే వణుకు పుడుతోంది. మీరైనా నన్ను అర్థం చేసుకోండి. ఈ సంబంధం పనికిరాదంటే రాయండి. అది మా పెద్దలకు చూపిస్తాను. నా బతుకుని ఆదుకోండి.”
జవాబు:- పురుషులు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎక్కువ బరువు ఉన్నా, తక్కువ బరువు ఉన్నా స్తంభించిన పురుషాంగం దాదాపు ఒకే పరిమాణంలో ఉంటుంది. అంతేగాని మనిషి ఒడ్డూ, పొడవు బట్టి పురుషాంగం పరిమాణం చిన్నదిగా ఉండటం, పెద్దదిగా ఉండటం ఉండదు. అందుకని మీ విషయంలో భయం అనవసరం. అంతే కాకుండా పురుషాంగం పరిమాణం బట్టి యోని కూడా పూర్తిగా విచ్చుకుంటుంది. దాని గురించి ఎటువంటి భయం అవసరం లేదు. మీరు నిర్భయంగా పెళ్ళి చేసుకోండి. దాంపత్య జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు.