ప్రశ్న:- ”నాదొక భయంకరమైన సమస్య. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు 1-2 స్ట్రోక్స్కే వీర్యం పడిపోతుంది. వెంటనే అంగం మెత్తబడుతుంది. సెక్స్ చేయలేక పోతున్నాను. మా ఆవిడ తన మీద నుంచి నన్ను లేవనివ్వదు. గట్టిగా చేతితో పట్టుకుంటుంది. వదిలిపెట్టదు. కంటిన్యూ చేయమని గోలపెడుతుంది. గోళ్ళతో గిచ్చివేస్తుంది. నేను ఏమీ చేయలేకపోవడంతో వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను ముఖం పక్కకి తిప్పి పడుకుంటాను. మా సంసారంలో తరచూ జరిగే కథ ఇది. ఈ సమస్య వల్ల నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుందనే భయం ఉంది. కాని ఆమె అంటే నాకెంతో క్రేజ్. ఆమెను వదిలి నేను ఉండలేను. అంత చక్కని భార్య దొరకదు. ఈ సమస్యతో నేను ఎంతో సతమతమవుతున్నాను. మీరే నా బ్రతుకు బాగుపరచాలి.”
జవాబు:- మీరు శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడుతున్నారు. శీఘ్రస్ఖలనానికి అతిగా క్రేజ్ ఉండడం, ఆరాటం కంగారు, తొందరపాటుతో పాటుగా త్వరగా అయిపోతుందనే భయం కూడా కారణమే. ఇవి ఉన్నవాళ్ళు ఆపుకుందామనుకున్నా ఆపుకోలేకపోతారు. సైకోథెరపీతో కొంతమందిలో శీఘ్ర స్ఖలనం సమస్యని తొలగించవచ్చు. ప్లూఆక్సిటిన్ 20 ఎం.జి. క్యాప్సుల్స్ ఉదయం-1, మధ్యాహ్నం-1 చొప్పున 3 నెలలు వాడండి. చాలావరకు ఫలితం కనబడుతుంది. మీకు స్ఖలనం అయ్యే సమయానికి మీ ఆవిడకి మూడ్ అందుకుంటోంది. దాన్ని తట్టుకోలేకపోతోంది. అందువల్లే అలా ప్రవర్తిస్తోంది. మీ శీఘ్రస్ఖలనం సమస్య తొలగితే ఆమె పూర్తిగా మామూలు అవుతుంది.