Friday, October 22, 2021
spot_img

అటుపైన నాలో సెక్స్‌ మేల్కొంది

ప్రశ్న:-   ”నా వయస్సు 35 సం||లు. ఇదివరకు సెక్స్‌లో అంతగా ఆసక్తి ఉండేది కాదు. మా వారు కూడా రోజుకి ఒకసారి సెక్స్‌లో పాల్గొంటారు. అదికూడా ఒక నిముషం, రెండు నిముషాలే. మీరు రాసే ఫోర్‌ప్లేలు, ప్లేలు, ఆఫ్టర్‌ప్లేలు, అవేవీ ఇద్దరికీ తెలియవు. అలాగే రతిలో పాల్గొనే విషయంలో యాంగిల్‌ ఒక రకమే తెలుసు. మీరు చెప్పే వివిధ భంగిమలు ఏవీ తెలియవు. అందుకని నాకు సెక్స్‌ అంటే ఆసక్తి ఏ మాత్రం లేకుండా పోయింది. గత కొద్ది నెలలుగా ఒకాయనతో నాకు శారీరక సంబంధం ఏర్పడింది. గంటలో రెండుసార్లు సెక్స్‌లో పాల్గొంటాడు. నన్నెంతో ప్రేరేపిస్తాడు. శారీరక స్పర్శలో ఎంతో థ్రిల్‌ ఉంటుందని, ఆయన సాంగత్యం వల్లే తెలిసింది. కాని మా ఇద్దరికీ శారీరకంగా కలవడానికి అవకాశం 10-15 రోజులకు ఒకసారిగానీ దొరకదు. ఆయనతో సంబంధం ఏర్పడిన తర్వాత నాకు రోజూ సెక్స్‌ కావాలనిపిస్తుంది. నన్ను నలిపేయాలని, పిసికేయాలని పిచ్చి కోరిక కలుగుతుంది. ఎక్కడ నుంచి ఈ సెక్స్‌ మేల్కొందో తెలియదు. కాని నేను తట్టుకోలేకపోతున్నాను. మావారు ఎప్పటిలాగానే బెల్లంకొట్టిన రాయిలాగా ఏ స్పందనా లేకుండా ఉంటున్నారు. నేను చేసేది తప్పు అని తెలుసు. కాని శారీరక సుఖం ముందు ఆ తప్పు అనే భావం కూడా లేకుండా పోతుంది. మావారితోనే సెక్స్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేయాలంటే ఏం చెయ్యాలి?”

జవాబు:-     దంపతులకి సెక్స్‌ విజ్ఞానం లేకపోతే మీ బ్రతుకులాగానే ఉంటుంది. సంభోగం అంటే సమభాగస్వామ్యం, సమభోగం అనేది తెలుసుకోవాలి. ఫోర్‌ప్లే, ప్లే, ఆఫ్టర్‌ ప్లే గురించి వివరంగా తెలుసుకోవాలి. వాటిని రతి సమయంలో తప్పకుండా అనుసరించాలి. దాంతో సెక్స్‌ సుఖం సొంతం అవుతుంది. మీరు మీ వారు సెక్స్‌ కౌన్సిలింగ్‌ పొందండి. తప్పకుండా మీ జీవితం సుఖమయం అవుతుంది. ఇంతవరకు సెక్స్‌లోని అసంతృప్తి వల్ల సెక్స్‌ సుఖం నిద్రాణంగా ఉండిపోయింది. పరాయి వ్యక్తి సాంగత్యంతో మీలో సెక్స్‌ మేల్కొంది. ఇక పరాయి వ్యక్తుల జోలికి పోకుండా మీ వారితోనే సెక్స్‌ని ఎంజాయ్‌ చేయండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!