ప్రశ్న:-”నాకు పెళ్ళి నిశ్చయమైంది. పెద్దలు నిశ్చితార్థం కూడా జరిపించారు. కాని ఇంకో ఆరు నెలల వరకు పెళ్ళి జరగదు. ఎంగేజ్మెంట్ అయిపోవడంతో మేమిద్దరం సినిమాలకీ, షికార్లకి వెళుతున్నాం. ఒకరంటే ఒకరికి పిచ్చి క్రేజ్ ఉంది. సెక్స్‌లో పాల్గొనాలనే కోరిక కూడా విపరీతంగా ఉంటోంది. అందువల్ల ఇప్పటికే ఆరుసార్లు సెక్స్‌లో పాల్గొన్నాము. కాని పెళ్ళి కాకుండానే గర్భం వస్తుందనే భయం ఉంది. ఏకాంతం దొరికితే కలవకుండా ఉండలేకపోతున్నాము. ఈ ఆరుసార్లలో మూడుసార్లే కండోమ్ వాడాము. తక్కిన మూడుసార్లు కండోమ్ వాడకపోయినప్పటికీ గర్భం రాలేదు. కండోమ్ వాడకుండా ఎప్పుడైనా సెక్స్‌లో పాల్గొంటే గర్భం రాకుండా ఉండే మార్గం చెప్పండి. వెంటనే వాడే పిల్స్ ఉంటే రాయండి. పెళ్ళి కాకుండా ఈ పిచ్చి పనులు ఏమిటని అనకండి. అయినా అనుకోని పరిస్థితుల్లో సెక్స్‌లో పాల్గొంటే గర్భం రాకుండా ఏదైనా మార్గం చెప్పండి.”
జవాబు:- ఎటువంటి రక్షణ లేకుండా సెక్స్‌లో పాల్గొని పురుషుని వీర్యం యోనిలో స్ఖలింపబడి గర్భం వస్తుందనే అనుమానం ఉన్నప్పుడు గర్భం రాకుండా నివారించేందుకు లివోనార్జెస్ట్రిల్ టాబ్లెట్లు తోడ్పడతాయి. ”పిల్-72” పేరిట ఈ మందులు మార్కెట్లో దొరుకుతాయి. ఎటువంటి రక్షణ లేకుండా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు 1-2 పూటల్లో ఈ బిళ్ళలు వాడితే గర్భం రాదు. ఈ బిళ్ళలని 72 గంటలలోగా వాడితేనే ఫలితం ఉంటుంది. మొత్తం మోతాదు రెండు బిళ్ళలే. ఒక బిళ్ళవాడిన 12 గంటల తర్వాత మరొక బిళ్ళ వేసుకోవాలి. సెక్స్‌లో పాల్గొన్న 24 గంటలలోగా ఈ బిళ్ళలు వేసుకోవడం జరిగితే 95 శాతం ఫలితం ఉంటుంది. 48 గంటల నుంచి 72 గంటలలోగా వేసుకుంటే 60 శాతం మాత్రమే ఫలితం ఉంటుంది. అందుకని వీలైనంత త్వరగా ఈ బిళ్ళలు వాడాలి. అరుదుగా కొందరికి ఈ బిళ్ళలు వాడటం వల్ల తలనొప్పి, వికారం, వాంతులు వంటివి ఉండవచ్చు. ఈ బిళ్ళలు వాడిన వారికి మామూలు సమయానికి మెన్సస్ వచ్చేస్తుంది. అంతేగాని ముందు మెన్సస్ రావడం ఉండదు. అనుకోని పరిస్థితుల్లో సెక్స్‌లో పాల్గొన్న స్త్రలు గర్భం రాకూడదని కోరుకున్నప్పుడు ఈ బిళ్ళలని వాడవచ్చు. ఒకే నెలలో రెండు మూడు సార్లు ఈ బిళ్ళలు వాడటం మంచిది కాదు. నెలలో ఎక్కువ సార్లు పాల్గొనే వాళ్ళు ఇతర గర్భనిరోధక సాధనాలని ఉపయోగించడమే సరైన పద్ధతి.