Friday, October 22, 2021
spot_img

ఆరాటం ఉన్నా, అంగం గట్టిపడటం లేదు

ప్రశ్న:-   ”నా వయస్సు 24 సంవత్సరాలు. గత 8 సంవత్సరాల నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను. నాకు సెక్స్‌ కోరిక విపరీతం. పరాయి స్త్రీలతో అయితే ఎవరైనా చూస్తారేమోనని భయం. పరాయి స్త్రీలతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని చావుదెబ్బలు తిన్నవాళ్ళు నాకు తెలుసు. అయినా స్త్రీలని అనుభవించాలనే కోరిక బలీయంగా ఉంది. అయిదారుగురు స్త్రీలతో వారి అంగీకారంతోనే సెక్స్‌కు ప్రయత్నించాను. విచిత్రం ఏమిటో వాళ్ళ ఎవరి దగ్గర నా అంగం గట్టిపడలేదు. అందరు కూడా నన్ను ఛీ కొట్టారు. నపుంసకుడికి ఇంత ఆరాటం ఎందుకని ఎద్దేవా చేశారు. హస్త ప్రయోగం చేయడం వల్లే ఇలా స్త్రీ దగ్గర ఫెయిల్‌ అయ్యానని అనుకుంటున్నాను. మామూలుగా అయితే హస్తప్రయోగం చేసి తృప్తి చెందగలుగుతున్నాను. స్త్రీలతో సెక్స్‌లో పాల్గొనాలంటే నరాల బలం చాలా ఎక్కువ కావాలా? నాకు చచ్చిపోవాలని ఉంది. చావే శరణ్యమా?”

జవాబు:-     హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం లేదు. సెక్స్‌కి పనికి రాకపోవడం ఉండదు. మీలో హస్తప్రయోగం గురించి అనవసర భయాలు ఉన్నాయి. పైగా చాటుమాటుగా సెక్స్‌లో పాల్గొనే వారికి భయం, కంగారూ ఉంటాయి. సెక్స్‌లో పాల్గొనాలనే తీవ్రమైన కోరిక ఉన్నప్పటికీ ఈ భయం వల్ల అంగం స్తంభించదు. పైగా ఒక ఫెయిల్యూర్‌ మరొక ఫెయిల్యూర్‌కి దారి తీస్తుంది. కిందటిసారి ఫెయిల్యూర్‌ చవి చూశావు కనుక ఈసారి కూడా అదే జరుగుతుందేమో అన్న భయం లోపల ఉంటే ఆ నెగెటివ్‌ సజిషన్‌, భయము మరో ఫెయిల్యూర్‌కి దారి తీస్తాయి. ఇదే మానసిక పరిస్థితి మీలో ఉంది. అందువల్లే స్త్రీల దగ్గర ఫెయిలై హస్త ప్రయోగంలో సక్సెస్‌ అవుతున్నారు. మామూలు రతికి, హస్త ప్రయోగానికి తేడా లేదు. అంగం స్తంభించడం ఉంటే ఎందులోనైనా ఒక్కటే. మీరు చనిపోనవసరం లేదు. అసలు విషయాన్ని అర్ధం చేసుకోండి. ధైర్యంగా ఉండండి. అక్రమ లైంగిక సంబంధాల జోలికి పోకుండా పెళ్ళి చేసుకుని ఎంజాయ్‌ చేయండి. మీకు కావలసిందల్లా ఆత్మవిశ్వాసం ఒక్కటే.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!