ప్రశ్న:- ”ఎయిడ్స్ రోగులకి కౌన్సిలింగ్ అవసరమంటారు. కౌన్సిలింగ్ ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏమిటి?’
జవాబు:- హెచ్.ఐ.వి./ఎయిడ్స్ నుంచి వ్యక్తులకి రక్షణ కలిగించడం, ఇతరులకి వ్యాధి సోకకుండా నివారించడం కౌన్సిలింగ్ ప్రధాన ధ్యేయం. అలాగే హెచ్.ఐ.వి./ఎయిడ్స్‌కి గురైన వ్యక్తి మానసికంగా కృంగిపోకుండా చూడటం, కుటుంబం నుంచి, సమాజం నుంచి సహకారం పొందేటట్టు చేయడం కూడా కౌన్సిలింగ్ ధ్యేయమే. రోగికే కాకుండా, కుటుంబ సభ్యులకి కూడా కౌన్సిలింగ్ చేయడం ఉంటుంది. కౌన్సిలింగ్ లేకపోతే ఆత్మహత్యలు, డిప్రెషన్, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, మనస్పర్థలు, కుటుంబ కలహాలు, సరైన చికిత్స పొందకపోవడం, ఆరోగ్యం కోల్పోవడం వంటి అనర్థాలు కలుగుతాయి. కౌన్సిలింగ్ ఏదో ఒకసారితో సరిపోదు. తరచూ జరుగుతూనే ఉండాలి. సరైన గైడెన్స్‌తో రోగి ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబ పరిస్థితి బాగుంటుంది. వ్యాది ప్రబలకుండా నిరోధించబడుతుంది. రోగిని రక్షించడం ఉంటుంది. అందుకే హెచ్.ఐ.వి./ఎయిడ్స్ వ్యాధి విషయంలో కౌన్సిలింగ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే కౌన్సిలింగ్ చేసేవారికి మంచి స్కిల్స్ ఉండాలి. అప్పుడే కౌన్సిలింగ్ చాలా ప్రయోజనకరం.