ప్రశ్న:- ”నా వయస్సు 65 సంవత్సరాలు. ఆరోగ్యంగానే ఉంటాను. నా వయస్సు వాళ్ళు చాలామంది ఇప్పటికే సెక్స్‌లో డౌన్ అయ్యారు. నేను మాత్రం 3-4 రోజులకి ఒకసారి సెక్స్‌లో పాల్గొంటాను. ఉన్న విషయం చెప్పాలి కనుక చెబుతున్నాను. ఇంట్లో వారానికి రెండు సార్లే పాల్గొంటే బయట స్త్రీతో వరుసగా రోజూ పాల్గొనడమే కాకుండా ఒక్కోసారి రోజుకి 2-3 సార్లు కూడా సెక్స్‌లో పాల్గొంటాను. పరాయి స్త్రీలతో సెక్స్ తప్పని తెలుసు. కాని ఒకటి తెలుసుకోవాలని ఉంది. ఇంట్లో చేయలేని వాణ్ణి బయట స్త్రీతో ఎలా చేయగలుగుతున్నాను. అనుకోకుండా వస్తున్న ఇటువంటి అదనపు శక్తి నన్ను త్వరగా నాశనం చేస్తుందా? నేను చేస్తన్న పని తప్పే అయినా సెక్స్ గురించి వివరణ ఇవ్వండి.”
జవాబు:- మంచి ఆరోగ్యం ఉండి చీకూ చింత లేకండా మనస్సు హుషారుగా ఉంటే 60 వచ్చినా, 70 వచ్చినా సెక్స్ సామర్థ్యం బాగానే ఉంటుంది. దాంపత్య జీవితం కొత్తదనం లేకుండా రొటీన్ అయిపోతే రోజూ సెక్స్‌లో పాల్గొనాలనే కోరిక ఉండదు. ఆసక్తి ఉండదు. అలా కోరిక, ఆసక్తి లేకపోవడాన్ని కొందరు సెక్స్ వీక్నెస్గా తీసుకుంటారు. ‘కొత్త ఒక వింత, పాత ఒక రోత’ అన్న సామెత చందంగా భార్య కాకుండా కాస్త సెక్సీగా ఉన్న స్త్రీ కనిపిస్తే మగవాడిలో డల్‌గా ఉన్న సెక్స్ ఒక్కసారిగా మేల్కొంటుంది. దాంతో ఒకటికి నాలుగుసార్లు సెక్స్‌లో పాల్గొనగలుగుతారు. అంతకుముందు లేని ఓపిక, శక్తి ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవచ్చు. శక్తి లేకపోవడం కాదు. ఆసక్తి లేకపోవడమే కారణం. భార్య దగ్గర సెక్స్ప్రేరణ లేకపోవడమే కారణం. కొత్తగా తటస్థపడిన స్త్రీ సెక్స్ ప్రేరణ కలిగించడంతో విజృంభిస్తారు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు కేవలం 150 కేలరీస్ ఖర్చు అవుతాయి. 150 కేలరీస్ అంటే రెండంతస్తుల మేడ మెట్లు ఎక్కి దిగిరావడానికి కావలసిన శక్తి మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో ఆ శక్తి తప్పకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆ మాత్రం శక్తిని కోల్పోవడం వల్ల నీరసం రానేరాదు. అందుకనే వయస్సు మళ్ళినప్పటికీ ఓపిక, హుషారు ఉండి సెక్స్‌లో ఎన్నిసార్లు పాల్గొన్నప్పటికీ కోల్పోయే ఆరోగ్యం ఏమీ ఉండదు. అయితే అక్రమ సంబంధాల వల్ల కోల్పోయే వేరే ఆరోగ్యం ఉంది. అది సుఖవ్యాధులు, హెచ్.ఐ.వి. రూపంలో ఉండొచ్చు. అంతేకాక మీ భార్యకి మీ ఎడల ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోతారు. లాంగ్ రన్లో ఇటువంటి పరిస్థితి చాలా ఇబ్బందులని తెచ్చిపెడుతుంది.