ప్రశ్న:- ”నాకు మొన్ననే పెళ్లి అయింది. మా ఆవిడ వక్షోజాలు బిగుతు లేకుండా లూజుగా ఉన్నాయి. ఆమెకు పెళ్లికి ముందే ఎవరితోనైనా సెక్స్ సంబంధాలు ఉండి ఉంటాయా? సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వక్షోజాలని బాగా నలిపేయడం జరిగిందంటారా? నాకు ఎందుకో ఇటువంటి అనుమానం అతిగా కలుగుతోంది. దానివల్ల ఆమెతో సెక్స్‌లో పాల్గొనలేకపోతున్నాను. నేరుగా ఆమెతో నా డౌట్‌ని చెప్పలేకపోతున్నాను. నేను సెక్స్ చేయకపోవడంతో ఆమె నాలో మగతనం లేనట్లుగా భావిస్తోంది. వాళ్ళ పేరెంట్స్‌కి నేను మగవాడ్ని కాదనట్టు, సెక్స్ చేయనట్టు కొంత హింట్ ఇచ్చింది. వాళ్ళు ఇన్‌డైరెక్ట్‌గా నీకు ఏమైనా వీక్‌నెస్ ఉంటే డాక్టరుకి చూపించుకోరాదు అని అంటున్నారు. నా పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. నా అనుమానాన్ని చెప్పేయమంటారా? ఉన్నదున్నట్టు చెప్పేస్తే గొడవలైపోతాయని భయంగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు.”
జవాబు:- వక్షోజాలు లూజుగా ఉండటానికి, సెక్స్‌లో పాల్గొనడానికి సంబంధం లేదు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నలిపినంత మాత్రాన వక్షోజాలు లూజు అవ్వవు. కొందరు అమ్మాయిలకి సహజంగానే వక్షోజాలు బిగుతుగా ఉండవు. అంతే తప్ప సెక్స్‌లో పాల్గొనడం వల్ల కాదు. మీరు అనవసరమైన అనుమానం వదులుకుని, మనస్సు కుదుటపరచుకుని వైవాహిక జీవితాన్ని చక్కగా అనుభవించండి. మీరు చక్కగా ఆవిడతో మెలిగితే మీమీద అనవసరంగా వచ్చిన నిందలు వాటంతటవే తొలగిపోతాయి.