ప్రశ్న:- ”నా వయస్సు 45 సంవత్సరాలు. మా వారి వయస్సు 50 సంవత్సరాలు. మా ఇద్దరికీ పిల్లల బాధ్యతలు తీరిపోయాయి. ఇప్పుడు నాలో సెక్స్ కోరికలు విపరీతమైపోయాయి. సహజంగానే నాకు కోరిక ఎక్కువ. మా వారితో సెక్సులో పాల్గొనప్పుడు క్షణాల్లో ఉద్రేకానికి లోనవుతారు. కాని ఏం లాభం? ఆయన 1-2 సెకన్లలో అవుట్ అయిపోతారు. దాంతో నాలో తీవ్రమైన బాధ కలుగుతుంది. ఒక్కొక్కసారి ఆయన అవుట్ అయిపోగానే తన ఫింగర్స్‌తో యోనిలో ప్రేరణ కలిగించి కొంత తృప్తిని కలిగిస్తారు. దాంతో అంతగా అసంతృప్తి అనిపించదు. కాని అలా ఫింగర్స్‌తో చేయడం వల్ల యోనిలోని నరాలు చచ్చుపడే ప్రమాదం ఉందా? సెక్సు లేకుండా అయ్యే అవకాశం ఉందా? పూర్వం మా వారికి శీఘ్రస్ఖలనం అవుతున్నా అంతగా పట్టించుకోలేదు. అప్పుడు రోజుకి 2-3 సార్లు చేయడం, వెంటవెంటనే చేయడంతో అంత ప్రాబ్లమ్ అనిపించలేదు. ఇప్పుడు సెక్స్ చేయడం తగ్గిపోవడం, వారి శీఘ్రస్ఖలనం సమస్య నా పాలిట శాపంగా మారింది. సిగ్గు విడిచి ఇంత వివరంగా రాసినందుకు క్షమించండి. నాలాంటి మహిళలు ఇంకా చాలామంది ఉంటారు. వారికోసమైనా వివరంగా రాయండి.”
జవాబు:- పురుషుల శీఘ్రస్ఖలనం సమస్య స్త్రీల సెక్స్ సమస్య అవుతుంది. వారు సెక్స్‌లో ప్రేరణ పొందకపోవడమో, అసంతృప్తికి లోనుకావడమో ఉంటుంది. కొందరికి ప్రిజిడిటీ తలెత్తుతుంది. సుఖం లేని సెక్స్ ఎందుకని సెక్స్‌పరంగా వయస్సు స్పందించకుండా అవుతుంది. ఒకవేళ భర్త మంచిగా తయారైనా ఆమె స్పందించకుండా ఉండిపోతుంది. భర్తకి శీఘ్రస్ఖలనం సమస్య ఉన్నప్పుడు నేరుగా సెక్సులో పాల్గొనకుండా ఫోర్‌ప్లే ఎక్కువ చేయాలి. స్త్రీకి బాగా మూడ్ వచ్చిన తరువాత భర్త అంగప్రవేశం జరిపి 10-12 స్ట్రోక్స్కే డౌను అయినప్పటికీ అంతగా అసంతృప్తి కలగదు. ఫింగరింగ్ వల్ల యోనిలో నరాలు డ్యామేజీ అవవు. ఆఫ్టర్ ప్లేలో కాకుండా ఫోర్ప్లేలోనే ఫింగరింగ్తో ప్రేరణ కలిగిస్తే మూడ్ అప్సెట్ ఉండదు. మీవారు శీఘ్రస్ఖలనం విషయంలో మందులు వాడితే చాలా వరకు రికవర్ అవుతారు. దంపతులిద్దరూ దాంపత్య సంబంధాల విషయంలో పరస్పరం మాట్లాడుకోవడం, ఎలా వ్యవహరిస్తే బాగుంటుందో చెప్పుకోవడం ఉంటే ఆ దాంపత్యం ఎంతకాలమైనా ఆనందదాయకంగా ఉంటుంది. మనస్సుని చంపుకుని పడి ఉంటే అసంతృప్తే ఇద్దరి మధ్య అగాధాలని సృష్టిస్తుంది. సెక్స్ సుఖం ఉన్న చోట ఎన్ని సంసార సమస్యలైనా చిన్నవి అవుతాయి. కావలసిందల్లా పరస్పర సహకారం, అవగాహన.