Saturday, October 16, 2021
spot_img

ఆ రోజులలో సెక్స్‌ అనారోగ్యమా?

ప్రశ్న:-   ”మాకు ఇటీవలనే పెళ్ళయింది. ఒకరంటే మరొకరికి ఎంతో ఇష్టం. ఇద్దరికీ సెక్స్‌ కోరికలు చాలా ఎక్కువే. పెళ్ళి అయిన దగ్గర నుంచి రోజుకీ 3-4 సార్లు సెక్స్‌లో పాల్గొంటున్నాము. సెక్స్‌ చేయనిదే నిద్రపట్టదు. సెక్స్‌లో పాల్గొంటున్న కొద్దీ మా వారికి సెక్స్‌ యావ మరీ పెరిగిపోయింది. కోరికను తట్టుకోలేక పోతున్నాను. మొన్నటి రోజున నేను మెన్సస్‌లో ఉండగా తన కోరికని వ్యక్తపరిచారు. మెన్సస్‌లో ఉన్న విషయం చెప్పాను. అయితే సరేలే ముద్దులతో సరిపెట్టుకుందామని మొదలుపెట్టారు. ఆ ముద్దులతో ఆయనలో ఎగ్జైట్‌మెంట్‌ పెరిగిపోయింది, నాకూ మూడ్‌ వచ్చేసింది. ఏదైతే అవనీ అని మొండి ధైర్యానికి వచ్చేసి ఇద్దరం శారీరకంగా ఒకటయ్యాము. అప్పుడు భయపడలేదు కాని అయిపోయిన తర్వాత భయం మొదలైంది. మెన్సస్‌లో ఉండగా సెక్స్‌లో పాల్గొంటే మగవానిలోకి మెన్సస్‌ రక్తం ప్రవేశించి విషంగా మారుతుందని ఎక్కడో విన్నాము. రక్తం విషంగా మారాక మగవానిలో రకరకాల బాధలు కలుగుతాయని, తలకి ఆ విషం ఎక్కి నరాలు దెబ్బతింటాయని, చూపు పోతుందని విన్నాం. అలాగే స్త్రీకి కూడా గర్భాశయం పుండు అయిపోతుందని విన్నాము. దాంతో మాలో చెప్పలేనంత భయం మొదలైంది. ఆ భయంతో మెన్సస్‌ అయిపోయినప్పటికీ సెక్స్‌లో పాల్గొనాలనే కోరిక లేకుండా తయారయ్యాము. మేము చాలా పెద్ద తప్పు చేశామా? మేము చేసిన తప్పుకి విరుగుడు ఉందా? లేదా? బ్రతుకు నాశనం కావలసిందేనా?” 

జవాబు:-     దంపతులిద్దరికీ కోరిక ఉండి మెన్సస్‌ సమయంలో సెక్స్‌లో పాల్గొనప్పటికీ ఎటువంటి అనర్థం కలగదు. మెన్సస్‌లోని రక్తం ఏమాత్రం విషకరమైనది కాదు. మెన్సస్‌లో రక్తం ప్రత్యేకంగా తయారవ్వదు. మామూలుగా రక్తనాళాలలో ప్రవహిస్తూ ప్రతి అవయవానికి, ప్రతీ క్షణం చేరే రక్తమే మెన్సస్‌ సమయంలో గర్భాశయం నుంచి కారుతుంది. అంతే తప్ప మెన్సస్‌ కోసమని ప్రత్యేకంగా తయారవ్వదు. మెన్సస్‌ బ్లడ్‌ కూడా ప్యూర్‌ బ్లడ్డే. ఈ విషయం తెలియక చాలామంది మెన్సస్‌లో పాల్గొన్నప్పుడు ఏదో అయిపోతుందని భయపడతారు. అసలు విషయాన్ని సైంటిఫిక్‌గా తెలుసుకుంటే ఎటువంటి అపోహలకి, భయాలకి తావు ఉండదు. సాధారణంగా మెన్సస్‌ సమయంలో స్త్రీకి కడుపు నొప్పి ఉండటం, చిరాకు అనిపించడం, సెక్స్‌ మీద ఇంట్రస్ట్‌ లేకపోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి ఆసక్తి, ఆనందం లేనప్పుడు భర్త కాస్త సంయమనం పాటించడం అవసరం. అంతేతప్ప మెన్సస్‌ సమయంలో సెక్స్‌లో పాల్గొంటే ఏదో అనర్థం జరిగిపోతుందని కాదు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!