ప్రశ్న:- ”నాకు ఒక విచిత్రమైన భార్య దొరికింది. ఆమెకు సెక్స్ మీద ఆసక్తి లేదు. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే సెక్స్‌కి అంగీకరిస్తుంది. ఆ సమయంలో మాత్రం పూర్తి మనస్సు పెట్టి సెక్స్‌లో పాల్గొంటుంది. ఆ సమయంలో సెక్స్ ఎడల ఆసక్తి కలిగో లేదా నటనో తెలియదు కాని అన్ని విధాలా నన్ను ప్రేరేపించి తానెంతో తృప్తి పొందుతున్నట్టు హావభావాలు ప్రకటిస్తుంది. మళ్ళీ ఎంత కాలానికి గాని సెక్స్‌కి ఒప్పుకోదు. ”నిన్న సెక్స్ అంటే అంత ఆసక్తి చూపించిన దానిని ఇవాళ ఎందుకని వద్దంటున్నావ్” అని అడిగితే సెక్స్ అనేది కేవలం సంతాన ప్రాప్తి కోసమే తప్ప తుచ్ఛమైన సుఖం కోసం కాదంటుంది. ఆమె కోరుకున్నట్టే ఆ ఒక్కసారికే కడుపు వస్తుందా అంటే అదీ లేదు. కనీసం ఆ పుట్టిన బిడ్డని చూసుకుంటూ, ఆ బిడ్డతో ఆడుకుంటూ అయినా తృప్తి చెందవచ్చు. మా దాంపత్యాన్ని సంతోషకరంగా మలచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో తెలియజేయండి?”
జవాబు:- ఎప్పుడో ఒక్కసారి సెక్స్‌లో పాల్గొంటే గర్భం రాదు. అధిక సంఖ్యాక స్త్రీలలో మెన్సస్ వచ్చిన 12వ రోజు నుంచి 18వ రోజు వరకు గర్భం వచ్చే దినాలు. ఆ రోజుల్లోనైనా కనీసం రోజు విడిచి రోజు దాంపత్యంలో పాల్గొనాలి. వేరే దినాల్లో దాంపత్యంలో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశం చాలా తక్కువ. ఈ విషయాన్ని మీ శ్రీమతికి తెలియజేయండి. అసలు ఆమెకు దాంపత్య సంబంధాల ఎడల ఆశక్తి ఎందుకు లేదో పరిశీలించాలి. ఆమె మనస్తత్వాన్ని విశ్లేషించాలి. ఇద్దరూ కలిసి డాక్టరు దగ్గరికి వెళ్ళండి. తగిన కౌన్సిలింగ్ ద్వారా ఆమె మనస్తత్వంలో మార్పు రావచ్చు. మీ వైవాహిక జీవితం సుఖప్రదం కావచ్చు.