ప్రశ్న:- ”నా వయస్సు 24 సంవత్సరాలు. పెళ్లికాకముందు నాకు ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉండేది. ఇద్దరం నాలుగు సంవత్సరాలపాటు సెక్స్‌లో విపరీతంగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు నాకు మరొకరితో పెళ్లి అయింది. నా భార్య బొద్దుగా ఉంటుంది. ఆమె పక్కన నేను పీలగా ఉంటాను. నా స్నేహితులకి నా గర్ల్‌ఫ్రెండ్ వ్యవహారం తెలుసు. పెళ్లికి ముందు గర్ల్‌ఫ్రెండ్‌తో విపరీతంగా సెక్స్‌లో పాల్గొనడం వల్లనే పీలగా ఉండిపోయానని అంటున్నారు. అది నిజమేనా? సెక్స్‌లో పాల్గొంటే పీలగా ఉండిపోయేటట్లు అయితే పెళ్ళైన వాళ్ళు చాలామంది సన్నగానే ఉండిపోవాలి కదా. నాకు తెలిసిన కొందరు పెళ్ళైన తర్వాత బాగా లావెక్కారు. నేను పీలగా ఉండటానికి గర్ల్‌ఫ్రెండ్‌తో సెక్స్ కారణమా? లేక మరొకటా? ఏది… ఏమైనా నేను లావు ఎక్కడానికి మార్గం చెప్పండి?”
జవాబు:- సెక్స్‌లో ఎంత పాల్గొన్నప్పటికీ బలహీనమవడం, సన్నగా మారడం ఉండదు. కొందరు సహజంగానే పీలగా ఉంటారు. అది వారి శరీర తత్వం. సరైన పౌష్టికాహారం తీసుకోకపోయినా సన్నగా ఉండిపోతారు. పెళ్ళైన తర్వాత కొందరు ఒళ్ళు చేయడానికి, వేళకు భోజనం చేయడం అంతకు ముందుకంటే ఎక్కువ భుజించడమే కారణం. మీరు లావెక్కడానికి కడుపునిండా భోజనం చేయండి. అరటిపళ్ళు, సపోటాలు, గుడ్లు, పాలు, మాంసం రోజూ తీసుకోండి. తప్పకుండా కొద్ది రోజుల్లో ఒళ్ళు చేస్తారు. ఒళ్ళు చేయడానికి సెక్స్‌లో మితంగా ఉండనవసరం లేదు.