Friday, October 22, 2021
spot_img

నష్టం కలుగుతుందా?

ప్రశ్న:-   ”నా వయస్సు 65 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఒక స్త్రీతో అక్రమ సంబంధం ఉంది. ఇద్దరం సెక్స్‌లో బాగా ఎంజాయ్‌ చేస్తాము. విచిత్రం ఏమిటో భార్య దగ్గర ఎంతకీ మూడ్‌ రాదు. మా ఆవిడ నాకు వృద్ధాప్యం వచ్చేసిందని సరిపెట్టేసుకుంది. అక్రమ సంబంధం ఉన్న స్త్రీతో మాత్రం 2-3 సార్లు పాల్గొనగలుగుతున్నాను. ఇలా ఈ వయస్సులో సెక్స్‌లో ఎక్కువగా పాల్గొనడం వల్ల ఏమైనా నష్టం కలుగుతుందా?”

జవాబు:-     సెక్స్‌కి వయస్సుతో ప్రమేయం లేదు. వయస్సు ఎంత మీదపడినప్పటికీ సెక్స్‌ సామర్థ్యం ఉంటే నిరభ్యంతరంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఎన్నిసార్లైనా సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఎటువంటి నష్టం కలగదు. మీ ఆవిడ మీద మీకు మోజు లేదు. అందువల్లే ఆవిడతో సెక్స్‌ చేయడం లేదు. అక్రమ సంబంధం ఉన్న స్త్రీ దగ్గర మీకు సెక్స్‌ పరంగా మంచి ప్రేరణ కలుగుతోంది. అందువల్లే ఆమెతో 2-3 సార్లు సెక్స్‌లో పాల్గొంటున్నారు. ఈ వయస్సులో ఇన్నిసార్లు సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎటువంటి నష్టమూ లేదు కాని అక్రమ సంబంధం వల్ల గొడవలు వస్తాయేమో చూసుకోండి.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!