Saturday, October 16, 2021
spot_img

అది గనేరియా

ప్రశ్న:-”నేను ఒక అపరిచిత స్త్రీతో కలిశాను. ఆమెతో కలిసి నాలుగు రోజుల నుంచి మూత్రం పోస్తూ ఉంటే మంట అనిపిస్తోంది. మూత్రనాళం నుంచి చీములాగా కారుతోంది. ఇది ఏమైనా సెక్స్‌ వ్యాధా? నేను సెక్స్‌లో పాల్గొన్న స్త్రీ చాలా ఆరోగ్యంగా కనబడింది. అందంగా ఉంది. ముఖంలో ఎటువంటి రోగ లక్షణాలు లేవు. చాలా హుషారుగా ఉంది. సెక్సులో పాల్గొన్నప్పుడు తనకిగాని, నాకుగాని ఎటువంటి బాధా అనిపించలేదు. సెక్స్‌ని ఎంతో చక్కగా ఎంజాయ్‌ చేశాము. కాని ఇప్పుడు ఎందుకని ఈ బాధ? ఈ బాధ తగ్గడమెలా?”

జవాబు:- గనేరియా, సిఫిలిస్‌, షాంక్రాయిడ్స్‌ లాంటి వ్యాధులు ఉన్నప్పటికీ పైకి బాగానే కనబడతారు. అంతమాత్రాన వాళ్ళల్లో ఏ వ్యాధీ లేదనుకోవడం పొరపాటు. మీరు రాసిన లక్షణాలను బట్టి ఆమె నుంచి మీకు గనేరియా వ్యాధి సంక్రమించింది. మీరు ఎజిథ్రోమైసిన్‌-1 గ్రామ్‌ ఒక బిళ్ళ వేసుకోండి. దాంతోపాటు సెఫిక్స్రిమ్‌ 200 మిల్లీగ్రాముల రెండు బిళ్ళలు ఒకేసారి వేసుకోండి. దీంతో మీకు సంక్రమించిన గనేరియా, దాంతో పాటు సాధారణంగా ఉండే క్లామిడియల్‌ ఇన్‌ఫెక్షన్లు రెండూ తొలగుతాయి. ఇంకా బాధలు మిగిలి ఉంటే డాక్టరుకి చూపించుకుని మందులు వాడండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!