ప్రశ్న:- ”నా వయస్సు 22 సంవత్సరాలు. 14 సంవత్సరాలు వయస్సు నుంచి నాలో సెక్స్ కోరికలు విపరీతంగా ఉన్నాయి. అప్పటి నుంచే అబ్బాయిలని తాకాలని, ముద్దు పెట్టుకోవాలని, వాళ్ళ అంగాన్ని చూడాలని తహతహ ఉండేది. ఇటీవలే నాకు పెళ్ళి అయింది. నాకు తగ్గట్టుగానే మంచి భర్త లభించాడు. నాకు సెక్స్‌లో మంచి థ్రిల్ అందిస్తాడు. సెక్స్‌లో పాల్గొనే ముందు నేను అతని పురుషాంగాన్ని బాగా ప్రేరేపిస్తాను. పెద్దదైన పురుషాంగాన్ని నా కళ్ళతో చూడటం ఎంతో ముచ్చట అనిపిస్తుంది. పురుషాంగంతో రకరకాలుగా ఆడుకుంటాను. పురుషాంగాన్ని చూషించాలని ఎంతో కోరిక ఉంటుంది. కాని అది తప్పని నా స్నేహితురాలు చెప్పింది. అలా చేస్తే ఆరోగ్యం చెడిపోతుందని హెచ్చరించింది. అయినప్పటికీ సెక్స్ తీవ్రత తట్టుకోలేక ఒక రోజు నోట్లో పెట్టుకుని ఏదేదో చేశాను. మావారు ఏమీ అనలేదు. నాకెంతో థ్రిల్ అనిపించింది. కానీ తర్వాత నా స్నేహితురాలి మాటలు గుర్తుకు వచ్చి భయమేసింది. వణికిపోయాను. ఇది జరిగిన మరుసటి రోజు నుంచి అనుక్షణం భయంతో బ్రతుకుతున్నాను. తిండి, నిద్రా రెండూ లేవు. సెక్స్ ఎడల ఆసక్తి కూడా తగ్గిపోయింది. నేను డల్‌గా ఉన్నానని మా వారి గోల. మామూలుగా కూడా డల్‌గా ఉంటున్నాను. మా వాళ్ళందరూ దేని గురించి ఆలోచిస్తున్నావో, దిగులు చెందుతున్నావో చెప్పమంటున్నారు. ఏం చెప్పను? ఎలా చెప్పను? ఇక నా బ్రతుకు పాడైపోయినట్టేనా? నన్ను మీరే రక్షించాలి. నేను చేసింది పెద్ద తప్పా?
జవాబు:- మీరు ఏమీ తప్పు చేయలేదు. అంగచూషణ రతికళలో ఒకటి. చాలామంది బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతారు. అందులో వాళ్ళకెంతో ఆనందం అనిపిస్తుంది. బొటనవేలు చీకడం వల్ల ప్రమాదం ఏమీ జరగదు కదా. పురుషాంగం కూడా అంతే. అది కూడా శరీరంలోని ఒక భాగమే. పురుషాంగం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటే అంగచూషణ చేయడం వల్ల ఎటువంటి అనారోగ్యం కలగదు. నోట్లో పుళ్ళు రావడంగాని, మరొకటి గాని జరగదు. ఒకవేళ నోట్లో వీర్యస్ఖలనం అయి, మింగేసినప్పటికీ ఏమీ అవ్వదు. అది కూడా శరీరంలో తయారయ్యే ఆరోగ్యకరమైన పదార్థమే. మీ స్నేహితురాలి మాట మిమ్మల్ని అనవసరంగా భయపెట్టింది. అందుకనే ఎవరైనా ఏమైనా చెబితే అది ఎంతవరకు సబబు, దాంట్లో ఎంతవరకు సైంటిఫిక్ ట్రూత్ ఉంది అనేది నిశితంగా పరిశీలించాలి. అంతేగాని గుడ్డిగా నమ్మేయకూడదు. మీరు అపరాధ భావనకు గురయ్యారు. జరగరాని తప్పు జరిగిపోయిందని భయపడ్డారు. అందుకే యుక్త వయస్సు రాగానే ప్రతి ఒక్కరికీ సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సెక్స్‌కి సంబంధించిన విషయాల పైన సైంటిఫిక్‌గా అవగాహన ఉండాలి. లేని పక్షంలో మీలాగే అపోహలతో, భయాలతో బ్రతుకుని బాధామయం చేసుకుంటారు. మీకేమీ అవలేదు, అవబోదు. హాయిగా ఉండండి.