ప్రశ్న:-”నిన్న, మొన్నటి వరకు నాలో బ్రహ్మాండంగా అంగస్తంభనలు ఉన్నాయి. రోజుకి 3-4 సార్లు హస్తప్రయోగం చేసుకుని సెక్స్ తృప్తి పొందేవాడిని. నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు నాలో వింత మార్పు వచ్చింది. అంగస్తంభనలు లేకుండా అయ్యాయి. హస్తప్రయోగం చేయాలని చేత్తో అంగాన్ని ఎంత ప్రేరేపించినప్పటికీ గట్టిపడటం లేదు. ఎందుకిలా అయిందో అంతుపట్టడం లేదు. అకస్మాత్తుగా నాలో నపుంసకత్వం ఎందుకు వచ్చింది? నేను హస్తప్రయోగం చేయబట్టే నపుంసకుడిగా మారానా? ఇలా జరగడం మంచికే అయ్యిందా? పెళ్ళి అయిన తరువాత ఈ నపుంసకత్వం దాపురించినట్టయితే పెళ్ళాం ఛీ కొట్టేది కదా. అప్పుడు నా తలకాయ తీసుకెళ్ళి రైలు పట్టాల మీద పెట్టవలసి వచ్చేది కదా. నా సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందా? చావే గతా? నా బాధని అర్థం చేసుకోండి.”
జవాబు:- అకస్మాత్తుగా వచ్చే నపుంసకత్వం సాధారణంగా మానసికమైనదే అవుతుంది. మీ విషయంలో ఏర్పడిన ఈ నపుంసకత్వం నూటికి నూరుపాళ్ళు మానసికమైనదే. ఇది ఎటువంటి నరాల బలహీనత, సెక్స్ బలహీనత కాదు. హస్తప్రయోగం వల్ల సెక్స్ బలహీనత లేదా నపుంసకత్వం కలగనే కలగదు. పెళ్ళి అనే సరికల్లా హస్తప్రయోగం గురించి మీలో ఉన్న అనవసరమైన భయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. మనస్సులో సెక్స్ గురించి ఏమాత్రం భయం ఉన్నా, అనుమానం ఉన్నా, ఆందోళన ఉన్నా అంగం స్తంభించదు. మీ విషయంలో అదే జరిగింది. మీకు ఎటువంటి నపుంసకత్వం ఏర్పడలేదు. మనస్సుని శాంతపరచుకోండి. భయం వదలండి. పెళ్ళి గురించి తీయని కలలు కనండి. అర్థంలేని భయాలు వదులుకుంటే ఆ తీయని కలలు నిజంగానే సాకారం అవుతాయి. ఒక్కసారి డాక్టరు కౌన్సిలింగ్ పొందండి. ఇక ఏ భయం ఉండదు.