ప్రశ్న:- ”నా వయస్సు 19 సంవత్సరాలు. పురుషాంగాన్ని చేతితో ప్రేరేపించుకుని సెక్స్ తృప్తి పొందే అలవాటు ఉంది. దానివల్ల అంగం చిన్నదైపోయింది. దాని క్రింద ఉండే ముష్కాలు చిన్నవైనాయి. మర్మావయవాలు పెరిగేందుకు మందులు రాయండి. నేను చాలా దిగులుగా ఉన్నాను. చేసిన పొరపాటుకు ఎంతో చింతిస్తున్నాను.”
జవాబు:- యుక్త వయస్సు వచ్చిన దగ్గర నుంచి హస్త ప్రయోగానికి లోనుకావడం అతి సహజమైన విషయం. ఎంత తక్కువ వయస్సు నుంచి హస్తప్రయోగం మొదలుపెట్టినా, రోజులో ఎన్నిసార్లు చేసినా పురుషాంగం చిన్నదవడం, బీర్జాలు కరిగిపోవడం ఉండదు. హస్తప్రయోగం తప్పు అనే ఫీలింగ్ మీలో ఉండటంతో భయం ఏర్పడింది. ఆ భయం వల్ల భ్రాంతి మనస్తత్వం పెంపొందింది. దానివల్ల అంగం, బీర్జాలు చిన్నవైనట్టు కనబడుతున్నాయి. అది మీ భ్రాంతే తప్ప నిజంకాదు. దానివల్ల హాని ఏమాత్రం లేదు. వయస్సుతో పాటు సహజంగా అలవడే ఈ అలవాటు గురించి భయపడనవసరం లేదు. మీరు విషయాన్ని అర్థం చేసుకుని మామూలైపోతే మళ్ళీ హుషారుగా మారిపోతారు. మందులేవీ అవసరం లేదు.