ప్రశ్న:-”నా వయస్సు 70 సంవత్సరాలు. మా ఆవిడ వయస్సు 60 సంవత్సరాలు. నాకు సెక్స్ చావలేదు. వారం – పదిరోజులకైనా సెక్స్ కావాలి. కాని మా ఆవిడకి సెక్స్ పూర్తిగా చచ్చిపోయింది. నేను సెక్సులో పాల్గొందామని అడిగితే చీదరించుకుని దూరంగా జరిగి పడుకుంటుంది. చెయ్యి వేస్తే విసిరి కొడుతుంది. చివరికి హస్తప్రయోగం చేసుకుని తృప్తి చెందుతాను. పెళ్ళాం ఉండి ఈ గతి ఏమిటో అంతుపట్టదు. 60 ఏళ్ళు దాటిన అందరి ఆడవాళ్ళు ఇలాగే ఉంటారా అని ఆలోచనలో పడ్డ సమయంలో మా చుట్టాల్లో ఒకామె – 65 సంవత్సరాలు ఉంటాయి – నాతో సెక్సుకి ఆసక్తి చూపింది. ఆమెతో సెక్సులో 4-5 సార్లు పాల్గొన్నాను. ఆమె మళ్ళీ మళ్ళీ కావాలని కోరింది. అలాగే ఇంకో ఇద్దరితో సెక్సులో పాల్గొన్నాను. వాళ్ళు కూడా పెద్ద వాళ్ళే. అయినా వాళ్ళు సెక్సులో బాగా ఇంట్రస్టు చూపారు. మరి మా ఆవిడ ఎందుకని సెక్సు ఎడల విముఖత కలిగి ఉంది? మా ఆవిడ సహకరిస్తే పరాయి స్త్రీలతో సెక్సు గొడవ ఉండదు. సెక్సు చంపుకుని పడి ఉండమని మాత్రం నాకు సలహా ఇవ్వకండి. సెక్సులో పాల్గొంటేనే హుషారుగా ఉంటాను. నా ఆరోగ్యానికి సెక్స్ మూలం.”
జవాబు:-జీవితంలో సెక్స్ ప్రాధాన్యతని కాదనలేం. భార్య సెక్స్‌కి విముఖత చూపిస్తోందని పరాయి స్త్రీలతో సెక్సుకి ఆసక్తి చూపించడం అనర్థాలకి కారణం అవుతుంది. మెనోపాజ్ రావడంతో మీ శ్రీమతిలో కొన్ని శారీరిక, మానసిక బాధలు తలెత్తి ఉండవచ్చు. దానివల్ల సెక్సులో విముఖత వచ్చి ఉండవచ్చు. ఇద్దరూ డాక్టరుని కలిసి కౌన్సిలింగ్ పొందండి. మెనోపాజ్‌కి చికిత్స పొందితే ఆవిడ బాగుపడుతుంది. మీ ప్రవర్తన, ఆమె ఎడల మీ వ్యవహార శైలి ఆవిడకి నచ్చడం లేదేమో కూడా గమనించుకోండి. ఆమెకు నచ్చని ప్రవర్తన మీలో ఉంటే సరిదిద్దుకోండి. ప్రవర్తన నచ్చకపోతే సెక్స్ ఎడల విముఖత ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి కౌన్సిలింగ్ పొందితే అంతా సజావుగా మారుతుంది. మీ ఆవిడ మళ్ళీ మీతో మామూలుగా ఉంటుంది. సెక్స్‌కి వయస్సుతో ప్రమేయం లేదు.