Tuesday, October 19, 2021
spot_img

బ్లూ ఫిల్మ్‌లో లాగా…

ప్రశ్న:-   ఈ మధ్య మా వారితో కలిసి బ్లూ ఫిల్మ్‌ చూశాను. చాలా ఉద్రేకం వచ్చింది. నా వయస్సు 35 సంవత్సరాలు. రాత్రివేళ వాటిని గుర్తుచేసుకుంటూ మా వారితో ముచ్చటిస్తే బాగుంటోంది. అంతా అయ్యాక ఎందుకిలా మాట్లాడుతున్నాను? అని సిగ్గు, భయం కలుగుతున్నది. ఇదేమైనా లోపమా? తెలుపగలరు.

జవాబు:-     సెక్స్‌పరంగా ప్రేరణ కలిగించడానికి, యాక్టివ్‌ చేయడానికి బ్లూఫిల్మ్‌లు కూడా కొంత వరకు తోడ్పడతాయి. అవి లైంగిక ప్రేరణ కలిగిస్తాయి. అటువంటి ప్రేరణే బ్లూఫిల్మ్‌ల వల్ల మీలోనూ కలుగుతోంది. బ్లూ ఫిల్మ్‌లో లాగా ప్రవర్తించాలంటే మనుష్యులలోని ఇన్‌హిబిషన్స్‌ని చాలా వరకు వదులుకోవాలి. ఇన్‌హిబిషన్స్‌ని వదులుకున్నప్పుడు సెక్స్‌లో విశృంఖలంగా పాల్గొనడం, విలక్షణంగా ప్రవర్తించడం, సెక్స్‌ పరమైన బూతులు మాట్లాడుతూ కామ పరంగా రెచ్చిపోవడం ఉంటుంది. సంస్కారంగా జీవితం గడిపేవాళ్ళు బ్లూ ఫిల్మ్‌లు చూసినప్పుడు తాత్కాలికంగా రెచ్చిపోయి విలక్షణంగా ప్రవర్తిస్తే ఆ తర్వాత సిగ్గుపడటం ఉంటుంది. సెక్స్‌లో ఒక్కరే ఓవర్‌గా ప్రవర్తిస్తే ఆ రెండవ వాళ్ళ నుంచి నెగ్‌టివ్‌ రెస్పాన్స్‌ వచ్చి సమస్యలు తలెత్తుతాయి. సెక్స్‌లో ఎంత విలక్షణంగానైనా ప్రవర్తించవచ్చు. మామూలుగా మాట్లాడే మాటలు కూడా మాట్లాడవచ్చు. కాని ఇద్దరి మూడ్‌ అదే రేంజ్‌లో ఉండాలి. అది గమనించే ప్రవర్తించాలి. లేకపోతే ఎన్నో ఇబ్బందులు వచ్చిపడతాయి. మీరు ఈ విషయంలో విజ్ఞతతో వ్యవహరించండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!