ప్రశ్న:- ”కొందరి పురుషాంగం పెద్దదిగా కనబడుతుంది. మరికొందరిలో చిన్నదిగా కనబడుతుంది. లైంగిక ప్రేరణ కలిగినప్పుడు పెద్దదిగా కనబడే పురుషాంగం అంతగా పొడుగు పెరగకుండా ఉండిపోతుందా? రతిలో స్త్రీకి బాగా తృప్తి కలగాలంటే పురుషాంగ పరిమాణం పెద్దగా ఉండడం అవసరమా?”
జవాబు:- రతిలో స్త్రీకి బాగా తృప్తి కలగడానికి పురుషాంగం పరిమాణంతో సంబంధం లేదు. స్తంభించిన పురుషాంగం చిన్నదిగా ఉన్నప్పటికీ స్త్రీకి సుఖప్రాప్తి కలిగే వరకూ స్ట్రోక్స్ ఇవ్వగలిగితే చాలు. పురుషాంగం పరిమాణం పెద్దదిగా ఉండి స్త్రీకి సుఖప్రాప్తి కలగక ముందే వీర్యస్ఖలనంతో మెత్తబడిపోతే స్త్రీకి ఎటువంటి తృప్తి ఉండదు. స్త్రీ యోనిలో కామతృప్తిని ప్రసాదించే కామనాడులు కేవలం 2-3 అంగుళాల లోతు వరకే ఉంటాయి. అటు పైన ఉండవు. అందుకని పురుషాంగం పరిమాణం బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఫలితం లేదు. సాధారణంగా పురుషులందరిలోనూ మామూలు సమయంలో పురుషాంగ పరిమాణం తర్వాత 14 నుంచి 18 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. 18 సెంటీమీటర్లు ఉన్న స్తంభించిన పురుషాంగం స్త్రీకి ఎంత తృప్తిని ఇస్తుందో 14 సెంటీ మీటర్లు ఉన్న స్తంభించిన పురుషాంగం అంతగానే తృప్తినిస్తుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే మామూలు సమయంలో కాస్త పెద్దదిగా కనబడే పురుషాంగం స్తంభించినప్పుడు ఇంకొంత మాత్రమే పెద్దదవుతుంది. చిన్నదిగా కనబడే పురుషాంగం స్తంభించినప్పుడు పెద్దదిగా కనబడే పురుషాంగం కంటే ఎక్కువ పరిమాణం పెరుగుతుంది. అందువల్ల పురుషాంగం పరిమాణం చిన్నదిగా ఉందని ఏమాత్రం దిగులు చెందనవసరం లేదు.