Friday, October 22, 2021
spot_img

ఆవిడంటే ఎంతో మోహం?

ప్రశ్న:-   ”నాకు ఒక స్త్రీతో శారీరక సంబంధం ఏర్పడింది. నాకు వీర్యస్ఖలనం అయిపోయినప్పటికీ సెక్స్‌ని కొనసాగించమని గట్టిగా ఫోర్సు చేస్తుంది. వీర్యం పడిపోవడంతో నేను చప్పబడిపోతాను. నేను చప్పబడటంతో ఆమె తట్టుకోలేదు. నన్ను గట్టిగా అదిమేసుకుని గోళ్ళతో గుచ్చేస్తుంది. బాధతో విలవిలలాడినా వదిలిపెట్టదు. నాకు ఆవిడంటే ఎంతో మోహం. ఆ వ్యామోహంతో ఆవిడకు దూరం కాలేకపోతున్నాను. కాని వెంటవెంటనే సెక్స్‌ చేయమని ఆవిడ చేసే డిమాండ్‌ని తట్టుకోలేకపోతున్నాను. ఆవిడ కోరిక మేరకు, వెంట వెంటనే ఎన్నిసార్లైనా సెక్స్‌ చేసే మందు చెప్పండి.” 

జవాబు:-     మగవాళ్ళల్లో ఒక్కసారి వీర్యస్ఖలనం అయిన తర్వాత సెక్స్‌పరంగా మళ్ళీ నరాలు స్పందించడానికి కనీసం పావుగంట, గంట పడుతుంది. ఇంకొంత మందికి ఇంతకంటే ఎక్కువ వ్యవధి కావాలి. స్త్రీలల్లో సుఖప్రాప్తి లభ్యమైనప్పటికీ తిరిగి వెంటవెంటనే పూర్తిస్థాయిలో సెక్స్‌పరంగా స్పందించడం ఉంటుంది. సెక్స్‌ కోరికలు ఎక్కువగా ఉన్న స్త్రీలు వెంట వెంటనే సెక్స్‌ కావాలని, తృప్తి పొందాలని ఆశిస్తారు. అటువంటి తృప్తి లభ్యం కాకపోతే రెస్ట్‌లెస్‌ అవుతారు. సెక్స్‌ని తట్టుకోలేకపోతారు. దాని ఫలితమే పురుషుడిని గట్టిగా హత్తుకోవడం, గిచ్చేయడం వెంటవెంటనే సెక్స్‌ చేయడానికి మందులేవీ లేవు. సెక్స్‌ని ఎక్కువ ఎంజాయ్‌ చేయాలని స్త్రీలు ఆశించినప్పుడు పురుషుడు నేరుగా సెక్స్‌లో పాల్గొనకుండా ఫోర్‌ప్లేలో ఆమెను బాగా ఉద్రిక్తపరిచి క్లైమాక్స్‌కి చేరిన తర్వాత సెక్స్‌లో పాల్గొనడం చేయాలి. అలా చేసినప్పుడు చాలామంది స్త్రీలు బాగా తృప్తి చెంది వెంటనే సెక్స్‌ చేయమని పురుషుడిని డిమాండ్‌ చేయడం ఉండదు. హైపర్‌ సెక్సువాలిటీ ఉన్న స్త్రీల విషయంలో మెళకువగా వ్యవహరించాలి. 

spot_img

Must Read

Previous articleMad Of Her?
Next articlePulses Will Not Stop Puss

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!