Tuesday, December 6, 2022
spot_img

హెచ్‌.ఐ.వి. ఉన్న అమ్మాయినే పెళ్ళి చేసుకోండి

ప్రశ్న:-   ”నా వయస్సు 22 సంవత్సరాలు. ముఖం మీద మొటిమలు విపరీతంగా ఉన్నాయి. దాంతో పాటు సెక్స్‌ కోరికలు కూడా భరించలేనంత ఉన్నాయి. స్త్రీతో సెక్స్‌లో పాల్గొంటే మొటిమలు తగ్గిపోతాయని చాలామంది చెబితే 10-15 సార్లు వేశ్యతో సెక్స్‌లో పాల్గొన్నాను. వేశ్యతో సెక్స్‌లో పాల్గొనప్పుడు కొన్నిసార్లు కండోమ్‌ వాడాను. మరికొన్నిసార్లు వాళ్ళే కండోమ్‌ వేసుకోకపోయినా ఫర్వాలేదన్నారు. కండోమ్‌ లేనప్పుడు నాకు మరింత థ్రిల్‌ అనిపించింది. ఎక్కువసార్లు కండోమ్‌ లేకుండానే సెక్స్‌లో పాల్గొన్నాను. ఎయిడ్స్‌ గురించి అనుమానం వచ్చి టెస్టు చేయించుకుంటే రక్త పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. నిర్ధారణ పరీక్షలో కూడా ఎయిడ్స్‌ ఉన్నట్టు తేలింది. ఇంట్లో పెళ్ళి చేస్తానంటున్నారు. నాకు ఎయిడ్స్‌ ఉందని అమ్మా, నాన్నలకు ఎలా చెప్పగలను? నేను ఒక్కడ్నే కొడుకుని. నాకు ఎయిడ్స్‌ ఉందని తెలిస్తే వాళ్ళు చచ్చిపోతారు. అందుకని వాళ్ళకి ఏం చెప్పకుండా వాళ్ళు చూసిన సంబంధమే చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. నా వ్యాధి భార్యకు సంక్రమించకుండా ఉండాలంటే ఏం చేయాలి?” 

జవాబు:-     హెచ్‌.ఐ.వి. ఉన్నప్పుడు రెండవ వాళ్ళకి సంక్రమించకుండా ప్రతిసారీ కండోమ్‌ వాడటం ఒక్కటే మార్గం. అయితే నెలలు తరబడి కండోమ్‌ వాడుతూ ఉంటే భార్య ఒప్పుకోకపోవచ్చు. పిల్లలు కావాలని ఫోర్సు చేయవచ్చు. దాంతో మీలో తెలియని మానసిక సంఘర్షణ మొదలవుతుంది. అందుకని హెచ్‌.ఐ.వి. ఉన్నప్పుడు పెళ్ళి చేసుకోకుండా ఉండటం ఉత్తమ మార్గం లేదా హెచ్‌.ఐ.వి. ఉన్న అమ్మాయినే పెళ్ళి చేసుకోవడం రెండో మార్గం. ఇక హెచ్‌.ఐ.వి. ఉన్నట్టు చెప్పి చేసుకోవడం మూడో మార్గం. అలా ఏ అమ్మాయైనా ఇష్టపడితే ఆమెకి వ్యాధి సంక్రమించకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ విషయంలో డాక్టరుని కలిసి తగిన కౌన్సిలింగ్‌ పొందండి. హెచ్‌.ఐ.వి. ఉన్నవాళ్ళు దాంపత్య విషయంలో, వారి భవిష్యత్‌ జీవితం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!