ప్రశ్న:-”నా వయస్సు 21 సంవత్సరాలు. ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. పెళ్ళి అంటే నాకు భయంగా ఉంది. ఎందుకంటే నా అంగం చిన్నదిగా ఉంది. మెత్తగా అనిపిస్తుంది. నిద్రలో తెలియకుండా వీర్యం పోతుంది. సెక్స్ కోరికలు ఉన్నాయి. అందమైన అమ్మాయి మనస్సులో మెదలగానే అంగం గట్టిపడుతుంది. కాని ఏం లాభం? అంగం చిన్నదవడంతో అమ్మాయిని తృప్తి పరచలేను కదా. అంగం పెరగడానికి, అంగం లావు అవడానికి, అంగం ఎక్కువ సేపు గట్టిపడి నిలిచి ఉండటానికి ఏవైనా మంచి మందులు రాసి పుణ్యం కట్టుకోండి.
జవాబు:-అందరు మనుషులూ ఒకటే ఎత్తు, ఒకటే బరువు, ఒకటే లావు ఉండనట్టే అందరి అంగాలు ఒకటే పరిమాణంలో ఉండవు. మామూలు సమయంలో అంగం చిన్నదిగానే ఉంటుంది. సెక్స్‌లో పాల్గొనాలనే కోరిక కలిగినప్పుడే అంగ పరిమాణం పెరుగుతుంది. మామూలు సమయంలో పురుషాంగం కేవలం మూత్రం బయటకు వచ్చేందుకు ఉపయోగపడే అవయవమే. పురుషాంగంలో ఎలాస్టిక్ కండరాలు ఉండటం వల్ల అవసరమైనప్పుడు సాగి, అవసరం లేనప్పుడు బాగా కుదించుకుపోయి చిన్నదిగా ఉంటుంది. అంతేతప్ప అంగం చిన్నది కాదు. సెక్స్ కోరికలు ఉండి, కోరిక రగిలినప్పుడు అంగం పెద్దది అవడం, హస్తప్రయోగం చేసుకోవడం, వీర్యస్ఖలనం అవడం ఉన్నప్పుడు ఇక అంగపరిమాణం గురించి ఆలోచించడం అనవసరం. అంగం చిన్నదనే అర్థంలేని ఆలోచన మనస్సులో చోటు చేసుకుంటే, ఆ దిగులు భయం వల్ల సెక్స్ కోరిక గట్టిగా కలగక, అంగం తగినంత స్తంభించకుండా ఉండిపోతుంది. మీ విషయంలో సెక్స్ కోరికలు, అంగస్తంభనలు ఉన్నాయి కనుక దిగులు వదిలి మనస్సుని హుషారుగా ఉంచుకోండి. అర్థంలేని అనుమానాలు, భయాలు అంగాన్ని సరిగ్గా స్తంభించకుండా చేస్తాయి. మీకు ఎటువంటి మందులు అవసరం లేదు. భయం వదిలి, ఆత్మవిశ్వాసంతో హుషారుగా ఉండటమే మీ సెక్స్ సామర్థ్యానికి మందు. మీరు నిర్భయంగా పెళ్ళి చేసుకోండి. ఇంకా మీలో జంకు ఉంటే డాక్టరుకి చూపించుకుని తగిన కౌన్సిలింగ్ పొందండి.