ప్రశ్న:-”నాకు పెళ్ళై పది సంవత్సరాలైంది. పెళ్ళైన మొదటి సంవత్సరాల్లో రోజూ సెక్స్‌లో పాల్గొనేవాళ్ళం. ఇప్పుడు మా వారు రాత్రి ఇంటికి వచ్చేసరికి అలిసిపోయి ఉంటున్నారు. నేను కావాలని అడిగినప్పటికీ ఆయన ఓపిక లేదంటారు. దాంతో సెక్స్ లేకుండా పోతోంది. నాకు రోజూ కావాలని ఉంటుంది. ఒక్కోసారి నిద్రకూడా పట్టదు. చివరికి స్వయంతృప్తితో మనస్సును శాంతింప చేసుకుంటాను. మా వారు తెల్లవారుఝామున అయితే సెక్స్‌కి ఓ.కే. అంటారు. అప్పుడప్పుడు తెల్లవారు ఝామున సెక్స్‌లో పాల్గొంటున్నాం. తెల్లవారు ఝామున సెక్స్‌లో పాల్గొనకూడదని కొందరు పెద్దవాళ్ళు అనగా విన్నాను. మేము చేసేది తప్పా? దానివల్ల నష్టం ఉందా?”
జవాబు:- సెక్స్‌లో పాల్గొనడానికి పగలూ, రాత్రీ తేడా లేదు. ఎవరి వీలును బట్టి వాళ్ళు సెక్స్‌లో పాల్గొనవచ్చు. తెల్లవారు ఝామున సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ ఏమీ అవదు. మీ వారు సాయంత్రం అయ్యేసరికి బాగా అలసిపోతున్నారంటే కేవలం పని ఒత్తిడి వల్లనా లేదా షుగరు, బి.పి. ఏమైనా ఉన్నాయేమో డాక్టరుకి చూపించుకోమనండి. అటువంటివి ఏమైనా ఉంటే చికిత్స పొందాలి.