Friday, October 22, 2021
spot_img

ఆయన ఉండలేరు ఎలా?

ప్రశ్న:-   ”నాకు కాన్పు అయి రెండు నెలలైంది. చిన్నాపరేషన్‌ అయింది. మూడు కుట్లు పడ్డాయి. ఆరు నెలల దాకా సంసారం చేయకూడదని అంటున్నారు. అంతకాలం ఆగాలంటే మా వారు ఉండలేరు. ఆయనకి కనీసం రోజుకి 2-3 సార్లు సెక్స్‌ కావాలి. ఇప్పుడు ఇంతకాలం అంటే ఆయన ఇంకెవరితోనైనా సంబంధం పెట్టుకుంటారని భయంగా ఉంది. ఈ భయం ఎవరితోనూ చెప్పుకోలేనిది. త్వరగా సంసారంలో పాల్గొనే మార్గం ఉందా? సిగ్గు విడిచి సెక్స్‌ గురించి అడుగుతున్నందుకు అన్యధా భావించవద్దు.” 

జవాబు:-     కాన్పులో కుట్లుపడ్డా, సిజేరియన్‌ ఆపరేషన్‌ అయినా రెండు నెలలు గడిచిన దగ్గర నుంచి మామూలుగా దాంపత్య సంబంధాల్లో పాల్గొనవచ్చు. ఆరు నెలలు ఆగనవసరం లేదు. యోని దగ్గర కుట్లు అయినా, పొట్ట మీద కుట్లు అయినా రెండు వారాలలోనే మానిపోతాయి. అందుకని కుట్లు తెగిపోతాయనే భయం అవసరం లేదు. వెంటనే గర్భం రాకుండా లూప్‌ వేయించుకోవడంగాని, నిరోధ్‌ వాడటం గాని చేయాలి. కాన్పుకి కాన్పుకి మధ్య కనీసం రెండు సంవత్సరాల గ్యాప్‌ ఉండాలి. అప్పుడే తల్లీబిడ్డల ఆరోగ్యం బాగుంటుంది.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!