Tuesday, October 19, 2021
spot_img

దానికి అంత భయం అనవసరం

ప్రశ్న:- ”నాకు పెళ్ళైంది. కాని అనుకోని పరిస్థితిలో వేరొక వ్యక్తితో సెక్స్‌లో పాల్గొన్నాను. ఆయన చాలా మంచివాడు. చక్కని ఆరోగ్యవంతుడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అనుకోకుండా ఇద్దరం ఆవేశానికి లోనుకావడంతో తప్పు జరిగిపోయింది. ఇది జరిగి ఆరు నెలలు అయింది. మళ్ళీ ఆ తప్పు చేయలేదు. కాని 10-15 రోజుల నుంచి వైట్‌ డిశ్చార్చి ఎక్కువ అవుతోంది. ఎటువంటి దురద, వాసన లేదు. అయినా జరిగిన విషయం నన్ను భయపెడుతోంది. డాక్టరుతో చెప్పుకోవాలంటే ఎంతో సిగ్గుగా ఉంది. డాక్టరుతో నేను తప్పు చేశాను అని ఎలా చెప్పగలను? ఈ తెలుపు నా కొంప ముంచుతుందేమోనని చాలా భయంగా ఉంది. మీరే నాకు ఏదైనా పరిష్కారం చూపించండి. నా టెన్షన్‌ తగ్గించండి.”

జవాబు:- వైట్‌ డిశ్చార్జి స్త్రీలలో అతి సహజం. వైట్‌ డిశ్చార్జి ఉన్నంత మాత్రాన ఏదో పెద్ద రోగం ఉందని భయపడనవసరం లేదు. మీరు చేసిన తప్పు పనిని వైట్‌ డిశ్చార్జికి అన్వయించుకుని హడలిపోతున్నారు. సాధారణంగా స్త్రీలలో ట్రైకోమొలియాసిస్‌, మొలియాసిస్‌ అని రెండు అతి సాధారణ వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాగే సెర్విసైటిస్‌ అని గర్భాశయ కంఠం దగ్గర పూత వంటివి వస్తాయి. ఇవన్నీ కామన్‌. వాటివల్ల వైట్‌ డిశ్చార్జి అవుతుంది. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోయినా, మెన్సస్‌ సమయంలో శుభ్రత పాటించకపోయినా వైట్‌ డిశ్చార్జి సమస్య పెరగొచ్చు. అందుకని మీరు భయపడిపోకండి. ‘ఫాస్‌-3’ కిట్‌ టాబ్లెట్లు ఒక్కరోజు వేసుకుంటే చాలు, మీ బాధలు తొలగిపోతాయి. ఒక అట్టలో 4 బిళ్ళలు ఉంటాయి. ఈ నాలుగు బిళ్ళలు ఒకే రోజులో వేసుకోండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!