ప్రశ్న:- ”సెక్స్‌లో పాల్గొన్న ప్రతిసారి మా వారు చాలా కంగారుగా, గాభరాగా కనబడతారు. చెమటలు ఎక్కువ పోస్తాయి. చాలా సందర్భాలలో అంగం స్తంభించి కూడా అంగప్రవేశం జరిగిన కొద్ది క్షణాల్లోనే మెత్తబడటం ఉంటుంది. ఆపైన ఇంకేమీ చేయలేరు. ఒక్కొక్కసారి చాలా చక్కగా సెక్స్ చేస్తారు. ఎప్పుడు బాగా చేస్తారో, ఎప్పుడు చేయలేరో అంతుపట్టని రహస్యం. ఎందుకంటే మా వారు అలా ఉంటారు?”
జవాబు:- కొందరిలో న్యూరోటిక్ పర్సనాలిటీ ఉంటుంది. వీళ్ళల్లో అర్థంలేని భయం, ఆందోళన, కంగారు, గాభరా ఉంటాయి. వాళ్ళమీద వాళ్ళకే విశ్వాసం ఉండదు. దానికితోడు సరిగ్గా సెక్స్ చేయకపోతే భార్య చిన్నచూపు చూస్తుందనే భయం ఉంటుంది. అందుకని చక్కగా చేయాలనే తాపత్రయం ఉంటుంది. దాంతో కంగారు వచ్చి ముచ్చెమటలు పోస్తాయి. కంగారు రావడం వల్ల అంగం కూడా పూర్తిగా నిలబడదు. మీ వారి విషయంలో ఇదే జరుగుతోంది. మీ వారిని డాక్టరుకి చూపించండి. ట్రాంక్విలైజర్ బిళ్ళలు వాడటం ద్వారాను, కౌన్సిలింగ్ సైకోథెరపీ ద్వారానూ కంగారు, గాభరా తగ్గుతాయి. సెక్స్‌లో చక్కగా పాల్గొంటారు.