Saturday, October 16, 2021
spot_img

కొత్త జంట పాత సమస్య…

ప్రశ్న:-   ”మాకు మొన్ననే పెళ్ళి అయింది. శోభనం కూడా ఏర్పాటు చేశారు. కాని ఇద్దరం ఒకటి అవలేదు. ఆయనకి లైంగిక సామర్థ్యం లేకపోవడం గాని, నాకు భయం ఉండటం గాని కారణం కాదు. ఇద్దరం చదువుకుంటున్నాం. రెండేళ్ళ వరకు పిల్లలు వద్దనుకున్నాం. ఆయనకి నిరోధ్‌ ఏమాత్రం ఇష్టం లేదు. నేను మెన్సస్‌ అయి 12 రోజులైంది. మెన్సస్‌ అయిన 10వ రోజు నుంచి 18వ రోజు వరకు గర్భం వచ్చే దినాలని పత్రికలో చదివాను. నెల మధ్యలో గర్భనిరోధక మాత్రలు వాడినా ప్రయోజనం ఉండదని తెలుసుకున్నాను. పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పలేదు. మా వారు నిరోధ్‌ వాడే ప్రసక్తే లేదు.” 

జవాబు:-     గర్భ నిరోధక మాత్రలు బహిష్టు స్రావం మొదలైన అయిదవ రోజున ప్రారంభించాలి. రోజూ క్రమం తప్పకుండా బిళ్ళలు వేసుకోవాలి. రోజుకి ఒక బిళ్ళ చొప్పున 21 రోజులు వాడాలి. మీలాగా నెల మధ్యలో దాంపత్యంలో పాల్గొనవలసి వచ్చినప్పుడు ‘టుడే’ వెజైనల్‌ టాబ్లెట్లు వాడవచ్చు. ఈ బిళ్ళని దాంపత్యంలో పాల్గొనే ప్రతీసారీ స్త్రీ తన జననేంద్రియ మార్గంలోకి ప్రవేశపెట్టుకోవాలి. రోజులో ఎన్నిసార్లు దాంపత్యంలో పాల్గొంటే అన్నిసార్లు వాడాలి. జననేంద్రియ మార్గంలోకి బిళ్ళని ప్రవేశపెట్టుకున్న తర్వాత దాంపత్యంలో పాల్గొనడానికి పది నిమిషాలు ఆగాలి. మీ విషయంలో ఈ పద్ధతి అవలంభించి ఈ రోజు నుంచే దాంపత్యంలో ఎంజాయ్‌ చేయండి. దాంపత్యం తొలి దినాల్లోని మాధుర్యాన్ని మిస్‌ కాకండి. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!