ప్రశ్న:- ”నా వయస్సు 60 సంవత్సరాలు. భార్య చనిపోయి అయిదేళ్ళు అయింది. ఇటీవల మా ఇంటి దగ్గర ఒకామె ఉంటే ఆమె ప్రోత్సాహంతో అప్పుడప్పుడు సెక్స్‌లో పాల్గొంటున్నాను. వారం రోజుల క్రితం ఆమె తీవ్రమైన అనారోగ్యానికి గురై మరణించింది. ఎయిడ్స్ వల్ల ఆమె చనిపోయిందని చాలామంది అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. గత ఆరు నెలలుగా ఆమెతో సెక్స్ సంబంధం ఉంది. నేను ఆమె చనిపోగానే హెచ్.ఐ.వి. టెస్ట్ చేయించుకున్నాను. నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. రెండు రోజులకి మళ్ళీ చేయించుకున్నాను. తిరిగి అలాగే రిపోర్టు వచ్చింది. రెండు రోజులకి మళ్ళీ చేయించుకున్నాను. తిరిగి అలాగే రిపోర్టు వచ్చింది. నాకు ఎయిడ్స్ ఉన్నాటా? పెద్ద వయస్సు వారికి ఎయిడ్స్ అంతగా ఉండదని అంటారు. కుర్రాళ్ళలోనే ఎయిడ్స్ అంటారు. నిజమేనా?”
జవాబు:- ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళతో సెక్స్‌లో పాల్గొంటే చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా ఆ వ్యాధి సంక్రమిస్తుంది. వ్యాధి సంక్రమించిన తర్వాత సాధారణంగా 3 నెలలకి అది బ్లడ్ టెస్ట్‌లో తెలుస్తుంది. మీకు ఆరు నెలల నుంచి లైంగిక సంబంధం ఉంది కనుక ఈపాటికి బ్లడ్ టెస్ట్‌లో తెలియాలి. హెచ్.ఐ.వి. నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది కనుక లేదని అనుకోవాలి. అయినా మరో మూడు నెలల తర్వాత తిరిగి టెస్ట్ చేయించుకోండి.