Friday, October 22, 2021
spot_img

పూర్వానుభవం అక్కర లేదు

ప్రశ్న:- ”నాకు త్వరలో పెళ్ళి కాబోతుంది. స్త్రీ యోనిలో రెండు రంధ్రాలు ఉంటాయని, వాటిని సరిగ్గా గుర్తించి సెక్స్‌లో పాల్గొనకపోతే అమ్మాయికి ఎంతో బాధ కలుగుతుందని, అటుపైన ఆమెకు భర్త మీద విముఖత ఏర్పడుతుందని, చాలా సంసారాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి ఇదే కారణమని నా స్నేహితుడు అన్నాడు. అతను చెప్పిన దగ్గర నుంచి నాకు చాలా భయంగా ఉంది. నాకు ఏ మాత్రం సెక్స్‌ విజ్ఞానం లేదు. సెక్స్‌ పుస్తకాలు ఏవీ చదవను. ఇప్పుడు నాకు పెద్ద భయం పట్టుకుంది. ఫస్ట్‌నైట్‌ ఎలా ఫేస్‌ చేయాలో తెలియడం లేదు. నా స్నేహితుడు పెళ్ళికి ముందే ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ప్రయోగం చేసి చూడమన్నాడు. పెళ్ళికి ముందు సెక్స్‌ అనుభవం తప్పనిసరా?” 

జవాబు:- స్త్రీ యోనిలో రెండు రంధ్రాలు ఉంటాయన్న మాట నిజమే అయినప్పటికీ రెండు రంధ్రాల్లో ఒకటి యోని ద్వారం కాగా మరొకటి మూత్రం వచ్చే రంధ్రం. మూత్రం వచ్చే రంధ్రం చాలా చిన్నదిగా ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప కళ్ళకి కనబడదు. పైగా యోని రంధ్రం లాగా ఇది విచ్చుకోదు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పురుషాంగ ప్రవేశంతో యోని రంధ్రం తేలికగా విచ్చుకుంటుంది. అందుకని పొరపాటుగా మరో రంధ్రంలోకి అంగప్రవేశం జరగడమనేది ఏమీ ఉండదు. మీ స్నేహితుడు ఏ మాత్రం మర్మావయవాల జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏవో చెప్పాడు. వివాహానికి పూర్వం సెక్స్‌ అనుభవం అవసరమని చెప్పిన మాట కూడా నిజం కాదు. మీరు పొరపాటున కూడా సెక్స్‌ అనుభవం కోసం ప్రయత్నించకండి. నిశ్చింతగా ఉండండి. మీ దాంపత్య జీవితం మధురంగా ప్రారంభమై ఎంతో చక్కగా కొనసాగుతుంది. 

spot_img

Must Read

Previous articleNo Need Of Experience
Next articleIt Is Just Like Thumb

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!