ప్రశ్న:- ”నాదొక వింత సమస్య. పెళ్ళై సంవత్సరమైంది. సెక్స్‌లో పాల్గొనప్పుడు యోనిలో నుంచి వీర్యం మొత్తం బయటకు వచ్చేస్తోంది. ఇలా రావడంలో ఒక వింత పరిస్థితి ఉంది. సెక్స్‌లో పాల్గొనప్పుడు స్పందనలు లేకుండా ఉంటే వీర్యం బయటకు రాదు. అలా కాకుండా నేను సెక్స్‌పరంగా ఎగ్జైట్ అవ్వకుండా ఉండాలని ప్రయత్నించినప్పటికీ చాలాసార్లు మా వారి ప్రేరణతో ఉద్రేకం వచ్చేస్తుంది. వీర్యం బయటకు వచ్చేస్తే కడుపు రాదట కదా. సంవత్సరమైనా నాకు ఇంకా గర్భం రాలేదు. త్వరగా తల్లిని కావాలని ఉంది. ఇలా అయితే ఎలా? ఎగ్జైట్ అవ్వకుండా ఉంటాలంటే ఏం చేయాలి?”
జవాబు:- వీర్యంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ద్రవం, రెండు వీర్యకణాలు. యోనిలో వీర్యం స్ఖలింపబడిన తర్వాత అందులోని వీర్యకణాలు వేరుపడి వెంటనే యోని గోడలకు చేరిపోతాయి. అక్కడి నుంచి యోని గోడలని పట్టుకుని గర్భాశయం వైపుకు పాకుకుంటూ పోతాయి. సంభోగం అయిన తరువాత బయటకు వచ్చేది కేవలం వీర్యంలోని ద్రవం మాత్రమే. ఈ ద్రవం ఏ మాత్రం ఉపయోగపడేది కాదు. శుక్రకోశాల నుంచి వీర్యకణాలని బయటకు తీసుకువచ్చేటంత వరకే దీని పని. సెక్స్‌లో ఎగ్జైట్ కానప్పుడు ఈ ద్రవం నిదానంగా యోని నుంచి బయటకు వస్తుంది. దుస్తులకు అంటుకుపోతుంది. ఈ ద్రవం మొత్తం 1-5 సిసి ఉంటుంది. ఇంత తక్కువ ద్రవం బయటకు వచ్చినప్పుడు తెలీదు. సెక్స్ ప్రేరణతో బాగా ఎగ్జైట్ అయినప్పుడు యోని బాగా విచ్చుకుంటుంది. దానికి తోడు యోని ద్వారం దగ్గర, యోని లోపల ద్రవాలు ఎక్కువ మోతాదులో తయారవుతాయి. అలా తయారైన ద్రవాలు వెంటనే బయటకు వస్తాయి. వీటితో పాటు వీర్యంలోని ద్రవాలు కూడా కలిస్తే మోతాదు కాస్త పెరుగుతుంది. ఈ ద్రవాలు ఎంత బయటకి కారినప్పటికీ గర్భం రావడానికి అవరోధం కాదు. అందుకని యోని నుంచి వీర్యం కారిపోతోందని అపోహ చెందనవసరం లేదు. మీ విషయంలో దంపతులిద్దరూ ఒకసారి డాక్టరుని సంప్రదించండి. డాక్టర్లు పరీక్ష చేసి ఇద్దరిలో ఎవరిలోనైనా సంతానం కలగకపోవడానికి లోపం ఉందేమో చూస్తారు. మీరు సెక్స్‌లో ఎగ్జైట్ అవకుండా మనస్సుని నిరోధించుకోనవసరం లేదు. ఎంజాయ్ సెక్స్.