ప్రశ్న:- ”నాకు మేనకోడలితో వివాహం అయ్యింది. రోజు సెక్స్‌లో పాల్గొంటున్నాం. కాని థ్రిల్ ఉండటం లేదు. పెళ్ళి కాకముందు ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలతో సెక్స్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో వాళ్ళు ఎంతో హుషారుగా పాల్గొన్నారు. నాకు చెప్పలేనంత తృప్తి కలిగింది. సెక్స్ చేస్తున్నంత సేపు సుఖానుభూతి ఏమాత్రం లేదు. మేనరికం చేసుకోవడం వల్ల, ఇద్దరి రక్తం ఒకటే కావడం వల్ల రక్తం వేడెక్కదా? సెక్స్‌లో పాల్గొనప్పుడు సుఖానుభూతి కలగదా? నా భార్య కూడా సెక్స్‌లో పాల్గొనప్పుడు ఏమీ అనిపించడం లేదంటుంది. మా ఇద్దరికీ సెక్స్ తృప్తి కలగాలంటే ఏం చేయాలి?”
జవాబు:- సెక్స్‌లో తృప్తికి, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ప్రధానం. ఒకరి మీద మరొకరికి క్రేజ్ ఉండాలి. వాళ్ళతో సెక్స్ సుఖం పొందాలనే తహతహ ఉండాలి. దగ్గర సంబంధీకుల్లో వివాహం చేసుకున్నప్పుడు చాలామంది దంపతుల్లో అటువంటి ఆకర్షణ, తహతహ ఉండదు. మీ విషయంలో ఇదే జరిగింది. అంతేతప్ప ఇద్దరి రక్తం ఒకటి కావడం వల్ల వేడెక్కపోవడం కాదు. మీరిద్దరూ మానసికంగా మరింత దగ్గర అవ్వండి. స్నేహితులు స్నేహబంధంతో ఎలా దగ్గర అవుతారో అదే విధంగా మీరిద్దరు కూడా ఒకరి గురించి మరొకరు బాగా పట్టించుకోండి. దాంతో ఇద్దరి మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది. ఒకరికోసం ఒకరు తహతహ లాడడం ఉంటుంది. సహకరించుకోవడం ఉంటుంది. దాంతో సెక్స్‌లో పాల్గొనప్పుడు తప్పకుండా ఆనందాన్ని, సుఖాన్ని పొందుతారు. అంతేగాని ఇద్దరి మధ్య ఆకర్షణ లేదని మరింత దూరం పెంచుకోకండి. మానసికంగా దగ్గరవడానికి ప్రయత్నించండి.