ప్రశ్న:- ”మా ఆయనకి ఇంకొక ఆమెతో సంబంధం ఉంది. నేను అడిగితే సంబంధం ఉన్న విషయాన్ని ఒప్పుకోరు. అయినా ఆయన తీరు చూస్తే అర్థమైపోతుంది. పూర్వకాలం ఎంతో ఆసక్తితో సెక్స్‌లో పాల్గొనేదాన్ని. ఇప్పుడు ఆయన బలవంతం మీద సెక్స్‌లో పాల్గొంటున్నాను. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత ఒళ్ళంతా దురదలు వస్తున్నాయి. అప్పటికీ సెక్స్ అయిపోగానే లేచి వెళ్ళి మర్మావయాలు శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. అయినా కొన్ని గంటల పాటు దురదలు అనిపిస్తాయి. మా వారికి సంబంధం ఉన్న ఆవిడకి ప్రమాదకరమైన జబ్బులు ఉండి ఉంటాయా? అవి నాకు సంక్రమిస్తున్నాయా? మా వారు సెక్స్‌కి పనికి రాకుండా తయారైతే బాగుండనిపిస్తోంది. అది ఎలా సాధ్యం?
జవాబు:- మీ వారికి పరస్త్రీ వ్యామోహం ఉందని తెలియడంతో భరించలేకపోతున్నారు. దాంతో ఆయన మీద అసహ్యం కలిగింది. ఆ అసహ్యమే దురదల రూపంలో వ్యక్తీకరింపబడుతోంది. మీ అనుమానం నిజమో, అబద్ధమో చెప్పడం కష్టం. కాని పరస్త్రీ సాంగత్యం వల్ల మీ ఒళ్ళంతా దురదలు వస్తున్నాయన్న మాట నిజం కాదు. వారికి లైంగి వ్యాధులు సంక్రమిస్తే మీకు మర్మావయాల దగ్గర దురద, మంటనిపిస్తాయి. పరస్త్రీతో సాంగత్యాన్ని నిదానంగా పోగొట్టే ప్రయత్నం చేయాలి తప్ప మీ వారికి పుంసత్వం పోవాలని కోరుకోవడం సరైన ఆలోచన కాదు. సంసారంలో ఒడిదుడుకులు చాలా వస్తూ ఉంటాయి. సానుకూల ధోరణితో వాటిని పరిష్కరించుకోవాలి. ఏదీ తెగేదాకా లాగకూడదు.