Friday, October 22, 2021
spot_img

భార్య పెద్దదైతే నష్టం లేదు

ప్రశ్న:-   ”నా వయస్సు 29 సంవత్సరాలు. నా కంటే తక్కువ వయస్సు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోవడం, పిల్లలు పుట్టడం జరిగిపోయింది. కుటుంబ సమస్యల వల్ల నాకు ఆలస్యం అయింది. నాకు తగ్గట్టుగానే నేను చేసుకున్న అమ్మాయికి కూడా వయస్సు దాదాపు 29. కాని వాళ్ళు 28 అని చెప్పారు. నా దృష్టిలో ఆమె వయస్సు 30 దాటే ఉంటుంది. మా అమ్మానాన్న దేన్ని చూసి ఒప్పుకున్నారో తెలియదు గాని ఎందరిలోనో ఈ అమ్మాయిని సెలెక్ట్‌ చేశారు. నా కంటే ఎక్కువ వయస్సు ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం నాకెందుకనో భయంగా ఉంది. నా ఆరోగ్యం క్షీణిస్తుందని భయపడుతున్నాను. సెక్స్‌లో కూడా సరిగ్గా పాల్గొనలేకపోతున్నాను. ఆమెతో సెక్స్‌తో పాల్గొన్నప్పటి నుంచి నాకు తలనొప్పి మొదలైంది. డాక్టరుకి చూపించుకుంటే దృష్టి దోషం లేదన్నాడు. పురుషుని కంటే స్త్రీ వయస్సు ఎక్కువగా ఉంటే అంతుపట్టని బాధలు, వ్యాధులు వస్తాయని అంటారు కదా. నా తలనొప్పికి ఇదే కారణమా?” 

జవాబు:-     భర్త కంటే భార్య వయస్సు తక్కువగా వుండాలనేది ఆచారంగా అనుకునేదే తప్ప అందులో ప్రత్యేకంగా ఏమీ లేదు. భర్య వయస్సు కంటే భార్య వయస్సు ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ భర్తకి ఎటువంటి అనారోగ్యం కలగదు. ఆమె యోనిలో హానికర పదార్థాలు ఏవీ ఉండవు. మీ విషయంలో తలనొప్పి అనిపించడానికి మీలో నెలకొని ఉన్న అవసరమైన మానసిక ఆందోళన, టెన్షనే కారణం. టెన్షన్‌, హెడేక్‌ ఉన్నప్పుడు దృష్టి దోషం ఉండదు. టెన్షన్‌, హెడేక్‌ తగ్గేందుకు మందులు వాడటం లేదా రిలాక్సేషన్‌ టెక్నిక్‌ అభ్యాసం చేయడం అవసరం. సైంటిఫిక్‌గా పరిశీలిస్తే పురుషునికి 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ అతనిలో వీర్యం విడుదల, వీర్యంలో వీర్యకణాలు ఉంటాయి. దీని వల్ల ఓ బిడ్డకు తండ్రి అయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీలని తీసుకుంటే 20 నుంచి 35 సంవత్సరాలు మధ్య వయస్సు వాళ్ళు మాత్రమే చక్కని సంతాన సాఫల్యత కలిగి ఉంటారు. చాలా తేలికగా గర్భం వస్తుంది. అటు తర్వాత గర్భం వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. సంతానం కలగడాన్ని దృష్టిలో ఉంచుకుని పురుషుని వయస్సు ఎక్కువ ఉన్నా ఫర్వాలేదు గాని స్త్రీ వయస్సు తక్కువ ఉండాలనే భావం ఆనవాయితీగా వస్తోంది. అందువల్ల అనవసరమైన ఆందోళన వదులుకొని ప్రశాంతంగా ఉండండి. మీ శ్రీమతి గర్భం వచ్చే అవకాశాలు బాగానే ఉంటాయి. కనుక ఎటువంటి దిగులు లేకుండా దాంపత్య జీవితాన్ని ఎంజాయ్‌ చేయండి. త్వరలోనే మీరు ఒక బిడ్డకు తండ్రి అవుతారు.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!