ప్రశ్న:- నా వయస్సు 35. గతంలో నాకు అంగస్థంభనాలు బాగానే ఉండేవి. పని వత్తిడి వల్లనేమో ఆ తరువాత సమస్య వచ్చింది. నా భార్యతో రతిలో అంగస్థంభన బాగానే ఉంది. నా గార్ల్‌ఫ్రెండ్‌తో మాత్రమే ఈ సమస్య వస్తుంది. దీనికి సిడ్నాఫిల్ సిట్రెట్ వాడవచ్చా? లేక నాకు షుగర్ ఏమైనా ఉన్నట్లా?
జవాబు:- భార్య దగ్గర అంగస్థంభన బాగానే వుంది. గర్ల్‌ఫ్రెండ్ దగ్గర అంగస్థంభన వైఫల్యం కలుగుతోందంటే చాలావరకు మానసిక సమస్య అవుతుంది. మీలో తెలియని కంగారు, భయం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇలా ఏదొక కాంప్లెక్స్ ఫీలింగ్ గర్‌ఫ్రెండ్ దగ్గర వైఫల్యానికి కారణం అవుతోంది. మనస్సులో ఆందోళన ఉన్నప్పుడు సిడినాఫిల్ బిళ్ళలు పనిచేయవు. అసలు మీకు ఈ బిళ్ళలు అవసరం లేదు. భార్య దగ్గర అంగస్థంభనలు బాగా ఉన్నాయంటే మీలో సెక్స్ బాగా ఉన్నట్లుగానే తీసుకోవాలి. మీరు పరాయి స్త్రీలతో సంబంధాలు మానుకోండి. ఇక ఎటువంటి టెన్షన్ ఉండదు.