Saturday, October 16, 2021
spot_img

కేన్సర్‌ తగ్గాక.

ప్రశ్న:-   ”నా వయస్సు 60 సంవత్సరాలు. మా ఆవిడ వయస్సు 55 సంవత్సరాలు. తనకి సర్వైకల్‌ కేన్సరు వచ్చింది. కేన్సరుకి కరెంటు పెట్టారు. పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఇప్పుడు మా ఆవిడ ఏ బాధా లేకుండా ఆరోగ్యంగానే ఉంది. సెక్స్‌ కావాలనే కోరిక కూడా ఉంది. నాకే భయం అనిపించి సెక్స్‌లో పాల్గొనడం లేదు. ఆవిడ కోరిక మేరకు సెక్స్‌లో పాల్గొంటే మళ్ళీ పుండు రేగుతుందా? ప్రమాదం అవుతుందా? సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆవిడ కేన్సరు నాకు వస్తుందా?” 

జవాబు:-     సర్విక్స్‌ కేన్సరుకి చికిత్స జరిగాక మామూలుగా దాంపత్య సంబంధాలలో పాల్గొనవచ్చు. పాల్గొనాలి కూడా. సెక్స్‌లో పాల్గొనకపోతే రేడియేషన్‌ వల్ల యోనిమార్గం కుదించుకుపోతుంది. దానివల్ల తర్వాత సెక్స్‌లో పాల్గొనాలన్నా కుదరకుండా అవుతుంది. అందుకని మీరు మామూలుగానే దాంపత్య సంబంధాలలో పాల్గొనండి. ఎటువంటి జంకు అవసరం లేదు. కేన్సరు అంటువ్యాధి కాదు. సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ మీకు సంక్రమించడం జరగదు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!