ప్రశ్న:-”నాకు హైడ్రోసిల్ ఉంది. డాక్టరుకి చూపిస్తే ఆపరేషన్ చేయించుకోవాలి అన్నారు. ఆపరేషన్ అంటే భయం. ఆపరేషన్ లేకుండా హైడ్రోసిల్ తగ్గదా? హైడ్రోసిల్ ఉంటే సెక్స్ సమస్యలు వస్తాయా?”
జవాబు:- హైడ్రోసిల్‌నే వరిబీజం అని, బుడ్డ అని అంటారు. ప్రారంభంలో హైడ్రోసిల్ చిన్నదిగా ఉంటుంది. అప్పుడు ఏమీ ఇబ్బంది అనిపించదు. నిదానంగా పరిమాణం పెరుగుతుంది. కొందరికి చాలా పెద్ద సైజు అవుతుంది. హైడ్రోసిల్‌కి ఆపరేషన్ ఒక్కటే మార్గం. మందులతో తగ్గదు. ఆపరేషన్ చేయించుకోకపోతే లోపల టెస్టికల్స్ నొక్కుకుపోయి డ్యామేజి అవుతాయి. కొందరిలో రక్తనాళాలు చిట్లుతాయి. ఇన్‌ఫెక్షన్ వస్తుంది. హైడ్రోసిల్‌కి ఆపరేషన్ ఎలాగూ తప్పదు కనుక మరీ పెరిగేదాకా ఆగకుండా చేయించుకోవడమే మంచిది. హైడ్రోసిల్ పెద్దదిగా ఉంటే చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా సెక్స్‌కి అడ్డుగా ఉంటుంది. అందుకని మీ విషయంలో డాక్టరుకి చూపించుకుని ఆపరేషన్ చేయించుకోండి.