ప్రశ్న:-”మా అబ్బాయికి 3 సంవత్సరాలు. అతనికి బీర్జాలు రెండూ పొత్తి కడుపులో ఉన్నాయి మరి ఇలా ఉంటే భవిష్యత్తులో మగతనంలో లోపం వస్తుందా? ఏం చేయాలి?”
జవాబు:-కొందరికి పుట్టుకతోనే ఇటువంటి సమస్య ఉంటుంది. రెండు బీర్జాలు బీజకోశంలో లేకుండా పొత్తికడుపు దగ్గర ఉండవచ్చు లేదా ఒకటి పైనా మరొకటి కిందా ఉండవచ్చు లేదా అసలు లేకపోవచ్చు. అల్ట్రాసౌండు స్కానింగ్ చేసి వృషణాలు ఎక్కడున్నవీ నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ పొత్తికడుపు దగ్గర ఉంటే ఆపరేషన్ చేసి కిందికి దింపాలి. లేనిపక్షంలో టెస్టికల్స్ డ్యామేజీ అవుతాయి. బిడ్డకి 2 నుంచి 4 సంవత్సరాలలోపే ఆపరేషన్ చేయాలి. పిల్లవాడు ఎదిగిన తర్వాత చేసినట్టయితే ఫలితం ఉండదు. టెస్టికల్స్ డ్యామేజి అవుతాయి.