Friday, October 22, 2021
spot_img

ఆపరేషన్లు సరే, ఆయన మాటేమిటి?

ప్రశ్న:-   ”మాకు పెళ్ళై నాలుగు సంవత్సరాలైంది. నాకు ఇంతవరకు గర్భం రాలేదు. లేడీ డాక్టరుకి చూపించుకుంటే నాలుగుసార్లు చిన్నాపరేషన్‌ కూడా చేశారు. బిళ్ళలు, టానిక్‌లు చాలా వాడాను. ఫలితం ఏమీ కనబడలేదు. చివరికి మా వారిని వీర్యం పరీక్ష చేయించుకోమన్నారు. వారి వీర్యంలో వీర్యకణాలు చాలా తక్కువ శాతంలో ఉన్నాయన్నారు. ఏవో మందులు రాసిచ్చారు. అయినా ఇంప్రూవ్‌మెంట్‌ రాలేదు. పైగా పూర్వం కంటే వీర్యకణాలు ఇంకా తగ్గిపోయాయి. మా వారికి వీర్యకణాలు తగ్గిపోవడానికి కారణం ఏమిటి? నాకు తల్లినయ్యే భాగ్యం లేదా?”

జవాబు:-     కొందరు పురుషుల్లో వేరికోసిల్‌ అనే పరిస్థితి ఉంటుంది. దానివల్ల వీర్యకణాలు రోజురోజుకి తగ్గిపోతాయి. పురుషుని వీర్యంలో వీర్యకణాలు తక్కువగా ఉన్నప్పుడు స్త్రీ గర్భం దాల్చడం ఉండదు. మీ వారిని పరీక్ష చేస్తే వేరికోసిల్‌ ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. వేరికోసిల్‌ ఉన్నప్పుడు మందులతో ప్రయోజనం లేదు. ఆపరేషన్‌ ఒక్కటే మార్గం. ఆపరేషన్‌ చేయించుకోకపోతే మందులు వాడుతున్నప్పటికీ రోజు రోజుకీ వీర్యకణాలు తగ్గిపోతాయి. మీ వారిని వెంటనే డాక్టరుకి చూపించండి. పిల్లలు లేనప్పుడు భార్యాభర్తలిద్దరూ ఒకేసారి చూపించుకోవాలి. మీ వారిలో లోపం పెట్టుకుని మీరు అనవసరంగా నాలుగుసార్లు చిన్నాపరేషన్‌ చేయించుకున్నారు. ఆయన వీర్యంలో లోపం ఉన్నప్పుడు మీరు ఎన్నిసార్లు చిన్నాపరేషన్‌ చేయించుకున్నా ఫలితం ఉండదు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!