Saturday, October 16, 2021
spot_img

ఎయిడ్స్‌ కంటే ఎయిడ్స్‌ ఫోబియానే ప్రమాదం

ప్రశ్న:-   ”నా వయస్సు 40 సంవత్సరాలు. జ్వరం వచ్చిందని ఓ చిన్న డాక్టరు దగ్గరికి వెళ్ళాను. డాక్టరు వేరే పేషెంటుకు వేసిన సూదితోనే నాకు ఇంజక్షను చేసినట్టు అనుమానం కలిగింది. ఆ రోజున ఆ డాక్టరు చేత హెపటటిస్‌ బి వ్యాక్సిన్‌ కూడా వేయించుకున్నాను. ఇంజక్షను చేసిన తీరు చూసి నాకు భయం కలిగింది. వెంటనే వేరే చోటుకి వెళ్ళి లేజరేటరీలో హెచ్‌.ఐ.వి. టెస్టు, వి.డి.ఆర్‌.ఎల్‌. టెస్టు చేయించుకున్నాను. అందులో నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టు చూసిన నేను లేబరేటరీ అతనితో హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ చేయించుకుంటే హెచ్‌.ఐ.వి. ఉన్నప్పటికీ లేదని నెగెటివ్‌ రిపోర్టు రావచ్చా అని అడిగాను. రావచ్చు అన్నాడు. దాంతో నాకు భయం పట్టుకుంది. ఇంజక్షను చేయించుకున్న రెండు రోజుల నుంచే జ్వరం వచ్చినట్టు అనిపిస్తోంది. ఎక్కువసార్లు విరోచనాలు అవుతున్నాయి. కడుపు వికారంగా ఉంటోంది. కండరాలు కరిగిపోతున్నాయి. నాకు ఎయిడ్స్‌ వచ్చినట్టేనా? నేను చచ్చిపోతానా?” 

జవాబు:-     ఎయిడ్స్‌ కంటే ఎయిడ్స్‌ ఫోబియా ఎక్కువ ప్రమాదకరం. సరైన విజ్ఞానం లేకపోవటం వల్లే ఇటువంటి భయాలు కలుగుతాయి. అనవసర అనుమానాలు, భయాలతో బతుకుని బాధామయం చేసుకుంటారు. కండకు చేసే ఇంజక్షన్లను సూది ద్వారా ఎయిడ్స్‌ వచ్చే అవకాశం చాలా తక్కువ. అదీకాక ఒకవేళ హెచ్‌.ఐ.వి. వచ్చినప్పటికీ మరుసటి రోజుకే వ్యాధి లక్షణాలు కలగవు. ఆ వ్యాధి లక్షణాలు ఏర్పడటానికి కనీసం అయిదు సంవత్సరాలు పడుతుంది. అందుకని మీలో కనబడుతున్న లక్షణాలన్నీ మీ భయం వల్ల పుట్టుకొచ్చినవే. నిర్భయంగా ఉండండి. మామూలు రక్త పరీక్షల ద్వారా ఎయిడ్స్‌ వచ్చిందీ, లేనిదీ తెలుసుకోవాలంటే కనీసం 3 నెలలు ఆగాలి. హెపటైటిస్‌-బి వ్యాక్సిన్‌ చేయించుకోవడం వల్ల రక్త పరీక్షలో ఎయిడ్స్‌ తెలియదనుకోవడం కూడా తప్పే. మీ భయానికి తగ్గట్టే ఆ లేబరేటరీ అతను తన అజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఎప్పుడైనా, ఎవరికైనా హెచ్‌.ఐ.వి. సోకడానికి అవకాశం ఉందని అనుకుంటే వెంటనే డాక్టరుని సంప్రదించడం, కండోమ్‌ వాడుతూ సెక్స్‌లో పాల్గొనడం, మూడు నెలలు గడిచిన తర్వాత ఎలీజా టెస్టుగాని, ట్రైడాల్‌ టెస్టుగాని చేయించుకుని వ్యాధి సోకిందీ, లేనిదీ నిర్ధారణ చేసుకోవడం అవసరం. అంతేగాని అనవసరమైన ఆందోళనలు, భయాలు, ఉపయోగం లేని టెస్టులు పనికిరావు.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!