ప్రశ్న:-”మాకు పెళ్ళై 30 సంవత్సరాలైంది. ఇప్పటికీ సెక్స్‌లో పాల్గొంటున్నాము. నా యోని లూజుగా ఉందని, తనకి తృప్తి కలగడం లేదని ఆయన గొడవ పెడుతున్నారు. ఆయన ఇటీవల ఒక పరాయి స్త్రీతో సెక్స్‌లో పాల్గొన్నారట. ఆవిడతో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు యోని టైట్‌గా అనిపించి ఎంతో తృప్తి అనిపించిందట. నా యోని వదులుగా ఉండటంతో సెక్స్ సుఖాన్నంతా కోల్పోతున్నానని సిగ్గు లేకుండా చెప్పారు. నన్ను ఆపరేషన్‌తో యోని టైట్ చేయించుకోమంటారు. ఈ వయస్సులో ఇదేం గోలో అర్థం కావలటం లేదు. డాక్టరు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో తెలియడం లేదు. మా ఆయనతో వచ్చిన ఈ గొడవకి దారి మీరే చెప్పండి.”
జవాబు:-కొంత వయస్సు వచ్చిన తరువాత శరీర దారుఢ్యం తగ్గి కండరాల బిగువు తగ్గుతుంది. యోని దగ్గర కండరాలు డీలా పడతాయి. దానివల్ల యోనిలూజు అనిపించవచ్చు. ఆపరేషన్ చేసి యోని కండరాలని దగ్గరకి చేసి కుట్టినప్పటికీ వాటిల్లో సాగే గుణం, ముడుచుకునే గుణం సరిగ్గా ఉండకపోవడంతో మళ్ళీ లూజు అవుతాయి. అందువల్ల సర్జరీవల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. వయస్సు రీత్యా వచ్చే మార్పులని అంగీకరించడం నేర్చుకోవాలి. మీరు రతి భంగిమల్లో కొంత మార్పు చేయండి. ఆయన కింద, మీరు పైన ఉండి చేసే రతిలో వారికి కొంత తృప్తికరంగా అనిపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ సెక్స్ తృప్తి కోసమని పరాయి స్త్రీతో మీ వారు సంబంధం పెట్టుకోవడం ఎయిడ్స్ వంటి వ్యాధులని ఆహ్వానించడమేనని, దాంతో మీ ఇద్దరి బ్రతుకులు నాశనమవుతాయని హెచ్చరించండి.