Tuesday, October 19, 2021
spot_img

పథ్యాలన్నీ అర్థం లేనివి

ప్రశ్న:-   ”దారినపోతూ ఉంటే ఊరకుక్క కరిచింది. అది మంచిదో, పిచ్చిదో తెలియదు. సర్కారు దవాఖానాకు పోయి కుక్క ఇంజక్షను చేయించుకున్నాను. కుక్క కరిస్తే ఆరు నెలల దాకా వంకాయ, గుమ్మడి, గోంగూర, చేపలు, కోడిమాంసం తినకూడదని అంటున్నారు. ఆ పథ్యం చేస్తే కాళ్ళు పడిపోతాయని అంటున్నారు. ఆరు నెలల వరకు స్త్రీ పథ్యం కూడా చేయాలంటున్నారు. నాకు పెళ్ళైంది. భార్య దగ్గరుంటే ఎప్పుడైనా తొందరపడితే తప్పు జరగవచ్చు కదా. భార్యని పుట్టింటికి పంపించేయనా? వర్షంలో తడిస్తే మరింత డేంజరట. వచ్చేది వర్షాకాలం కదా. తల తడవకుండా ఎలా కాపాడుకోవాలి? అన్నీ సమస్యలే. నాకు సరైన సలహా ఇవ్వండి.”

జవాబు:-     పిచ్చి కుక్క కరిస్తే ”యాంటీ రేబీస్‌” వ్యాక్సిన్‌ ఇంజక్షన్లు పూర్తి కోర్సు చేయించుకోవడం తప్ప వేరే పథ్యాలు, నియమాలు, నిషేధాలు లేవు. కుక్క కరిస్తే చెప్పే పథ్యాలన్నీ అర్థం లేనివి. మీరు అవేవీ పట్టించుకోవద్దు. అన్నీ తినేయండి. భార్యతో మామూలుగా సంసారంలో పాల్గొనండి. వర్షం తడిసినా ఏమీ అవదు. మీరు ఇప్పటికే పిచ్చికుక్క ఇంజక్షను చేయించుకున్నారు కనుక కుక్క కరిచిన మాటే మరిచిపోయి మామూలుగా ఉండండి.

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!