Saturday, October 16, 2021
spot_img

శిశువుల గుండెకు రక్షణ రూబెల్లా వ్యాక్సినే

ప్రశ్న:-   ”ఈనాడు ప్రభుత్వం గుండెజబ్బులతో పుట్టిన చిన్నారులెందరికో ఆపరేషన్లు చేయిస్తోంది. వాటి బదులు వాళ్ళు గుండెజబ్బుతో పుట్టకుండా నివారించలేమా?” 

జవాబు:-     జన్యు లోపాల వల్ల, కొన్ని ఇన్‌ఫెక్షన్ల వల్ల మాతృగర్భంలో ఉండగానే గుండె లోపాలు గర్భస్థ శిశువుకు ఏర్పడతాయి. తల్లి గర్భిణీగా ఉండగా రూబెల్లా (జర్మన్‌ మీజల్స్‌) వస్తే గర్భస్థ శిశువు మీద దుష్భలితాలు అధికంగా కనబడతాయి. టోగా వైరస్‌ సోకడం వల్ల రూబెల్లా వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి చిన్నా పెద్దా అన్ని వయస్సుల వారికీ వస్తుంది. పొంగు జ్వరం వచ్చి వారిలో ముఖం మీద, ఒంటిమీద ఎర్రని దద్దుర్లు (రాష్‌) జ్వరం, లింఫ్‌ గ్రంథుల వాపు వచ్చినట్టుగానే ఇందులోనూ వస్తుంది. వారం రోజుల్లో బాధలు తగ్గిపోతాయి. ఈ వ్యాధి వచ్చినవారు దగ్గినా, తుమ్మినా రెండవ వారికి తేలికగా వ్యాధి క్రిములు సంక్రమిస్తాయి. గర్భిణీ స్త్రీకి ఈ వ్యాధి సంక్రమిస్తే వారిలో సగం మందికి గర్భస్రావం అయిపోతుంది. మిగిలిన సగం గర్భస్థ శిశువులకి గుండెలో లోపాలు, అంగవైకల్యాలు, బుద్ధిమాంద్యం, మెదడు ఎదగకపోవడం వంటివి వస్తాయి. ముఖ్యంగా గుండె కవాటాల లోపం అడ్డుగోడలకి కన్నం పడటం, నిర్మాణ లోపాలు ఏర్పడతాయి. 

పుట్టుకతోనే గుండె జబ్బుతో పుట్టే ఎందరో చిన్నారులకి రూబెల్లా దుష్ఫలితానే కారణం. అందుకని ప్రతి స్త్రీ పెళ్ళికి ముందే రూబెల్లా రాకుండా వ్యాక్సిన్‌ చేయించుకుంటే ఎందరో శిశువులు ఈ వ్యాధికి గురికారు. గుండె జబ్బుకి లోనుకారు. ప్రతి ఆడపిల్ల 10-12 సంవత్సరాల వయస్సులోనే రూబెల్లా వ్యాక్సిను ఒకటి చేయించుకోవాలి. లేదా పెళ్ళికి కనీసం 6 నెలల ముందు చేయించుకోవాలి. ఒకవేళ పెళ్ళి అయిపోతే రూబెల్లా వ్యాక్సిను చేయించుకుని 6 నెలల పాటు గర్భం రాకుండా జాగ్రత్తపడాలి. రూబెల్లా వ్యాక్సిను ఏ మాత్రం ఖరీదు కాదు. కావలసిందల్లా ప్రతి ఆడపిల్లకి రూబెల్లా అవసరమనే అవగాహన. తల్లి తీసుకునే చిన్నపాటి జాగ్రత్తతో ఎందరో చిన్నారులు గుండెజబ్బుతో పుట్టకుండా రక్షించవచ్చు. 

spot_img

Must Read

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!