ప్రశ్న:- ”నాకు ఇంకా పెళ్ళి కాలేదు. తరచూ యూరిన్‌తోపాటు వీర్యం పోతుంది. లేబరేటరీలో యూరిన్ పరీక్ష చేయిస్తే అందులో వీర్యకణాలు ఉన్నాయని చెప్పారు. ఇలా వీర్యం పోవడం వల్ల నీరసపడిపోతానని భయంగా ఉంది. ఇంతవరకూ బాగానే ఉన్నాను. ఇంకెంత కాలం ఇలా బలంగా ఉంటానో తెలియదు. మూత్రం వీర్యం పోకుండా మందులు రాయండి.”
జవాబు:- వీర్యం వ్యర్థ పదార్థం. అది మూత్రంలోకి పోయినా, మరొక విధంగా పోయినా నష్టం ఏమీ జరగదు. అందులో వీర్యకణాలు గర్భధారణకు తోడ్పడతాయి కనుక ఆ వీర్యం ఎంతో విలువైందని అనుకుంటే పొరపాటే. ఎంత వీర్యం పోయినప్పటికీ ఏమీ అవదు. రేపు పెళ్ళయి రోజూ సెక్స్‌లో పాల్గొంటూ ఉంటే ఇలా మూత్రంతో పాటు వీర్యం పోవడం ఉండదు. మీకు ఇంకా పెళ్లి కాలేదు కనుక నిరంతరం తయారయ్యే వీర్యంతో శుక్రకోశాలు నిండిపోయి మూత్రవిసర్జన సమయంలో మూత్రకోశం వత్తిడి శుక్రకోశాల మీద కలిగి వీర్యం బయటకు వస్తోంది. ఇది అతి సహజమైన విషయం. దీని గురించి పట్చించుకోనవసరం లేదు. మీకు ఏమీ అవదు. నీరసపడటం అసలే ఉండదు. మందులు, మాకులు ఏమీ అవసరం లేదు.